తెలుగునాట దుల్కర్ క్రేజ్ ఎక్కువే

దుల్కర్ సల్మాన్, అల్ మోస్ట్ ఇప్పుడు తెలుగు హీరో లెక్క. మహానటి నుంచి సీతారామం మీదుగా ఇప్పుడు వస్తున్న లక్కీ భాస్కర్ వరకు. 41 ఏళ్లు అంటే నమ్మేలా వుండడు. చాలా మంది హీరోల్లా…

దుల్కర్ సల్మాన్, అల్ మోస్ట్ ఇప్పుడు తెలుగు హీరో లెక్క. మహానటి నుంచి సీతారామం మీదుగా ఇప్పుడు వస్తున్న లక్కీ భాస్కర్ వరకు. 41 ఏళ్లు అంటే నమ్మేలా వుండడు. చాలా మంది హీరోల్లా కంప్యూటర్ గ్రాఫిక్స్ చెక్కుళ్లు అక్కరలేదు. ఏ యాంగిల్ లో కెమేరా పెట్టినా అందంగానే వుంటాడు. తనదైన మాట.. నటన ఇవన్నీ తెలుగు ప్రేక్షకులకు నచ్చేసాయి. అందుకే ఓన్ చేసేసుకున్నారు. తెలుగులో మరో మూడు సినిమాలకు సైన్ చేసాడు. రానా ప్రాజెక్ట్ ఒకటి, పవన్ సాధినేని దర్శకత్వంలో మరొకటి, సుధాకర్ చెరుకూరి నిర్మాతగా ఇంకొకటి, లక్కీ భాస్కర్ విడుదల సందర్భంగా ‘గ్రేట్ అంధ్ర’తో మాట్లాడారు దుల్కర్ సల్మాన్. అ ముచ్చట్లు.

‘కథలు అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. కథలో ఒరిజినాలిటీ వుందా లేదా అన్నది చూస్తాను. రీమేక్ అంటే అంగీకరించను. ఒక హిందీ వెబ్ సిరీస్ కోసం మంచి రెమ్యూనిరేషన్ అఫర్ చేసారు. కానీ రీమేక్ అని తెలిసి నో అన్నాను.’

‘లక్కీ భాస్కర్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే కథ. మనకు తెలిసిన వాళ్లలో ఎవరో ఒకరైనా లక్కీ భాస్కర్ వుంటారు. ప్రతి ఒక్కరు అ పాత్రతో కనెక్ట్ అవుతారు.’

‘దర్శకుడు వెంకీ అట్లూరికి ప్రేక్షకుల పల్స్ తెలుసు. అందుకే ఏ ఎలిమెంట్ మిస్ కాకుండా చూసుకుంటారు. నేను తెలుగులో ఎక్కువ సినిమాలు చేయడానికి కారణం ఎక్కువ రెమ్యూనిరేషన్ ఇస్తారని కాదు. నేను మలయాళంలో నిర్మాతగా వున్నాను అందువల్ల రెమ్యూనిరేషన్ అన్నది పాయింట్ నే కాదు. ఇక్కడ నిర్మాతలు నచ్చారు. అందుకే చేస్తున్నాను.’

‘స్వప్నదత్, నాగి నన్ను మహానటి సినిమా కోసం ఒప్పించడానికి చాలా కష్టపడ్డారు. అంతే కాదు నాకు అన్ని విధాలా సహకరించారు. అందువల్ల వాళ్లు అడిగితే జ‌స్ట్ అలా ఒక సారి కనిపించి వెళ్లిపోయే పాత్ర అయినా చేసేస్తాను. కల్కి సినిమా సెట్ కు వెళ్లిన తరువాత కచ్చితంగా అ సినిమాలో కనిపించి తీరాలనిపించింది. అందుకే అడిగి మరీ చేసాను. కల్కి 2 లో కూడా చేస్తానా, చేయనా అన్నది కాదు. నాగి చేయమంటే చేసేయడమే’

‘ప్రభాస్ తో కాంబినేషన్ వర్క్ జ‌రగలేదు. లేదంటే ప్రభాస్ అతిథ్యం స్వీకరించే అవకాశం దొరికేది. దాని గురించి చాలా మంది చాలా గొప్పగా చెప్పారు. నేను హైదరాబాద్ నుంచి వెళ్లినపుడు రంజాన్ సీజన్ లో హలీమ్ తీసుకెళ్లకుండా మరిచిపోను’.

10 Replies to “తెలుగునాట దుల్కర్ క్రేజ్ ఎక్కువే”

  1. తెలుగు వారికి పక్కింటి పుల్లకూర తియ్యగా ఉంటుంది.. ఇది పాత జాఢ్యం ..

  2. కోoదరికి అదృష్టం.. దేముడు లేదా ప్రకృతి ఇచ్చిన జీన్స్ ..

    వాళ్ళ నాన్న ముమ్ముట్టు గారు కూడా 80 ఏళ్ల వయస్సులో కూడా ఇంకా 40 ఏళ్ల అతని లాగ కనిపిస్తారు.

    అందువల్లే కాబోలు అతని కొడుకు కూడా వయస్సుకు తగ్గి కనిపిస్తారు.

    గోల్డెన్ స్పూన్ తో పుట్టిన కూడా పొగరు లేకుండా మంచి వాడే అని ఇండస్ట్రీ లో పేరు.

Comments are closed.