పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో సినిమా లాక్ అయి చాలా ఏళ్లయింది. అయితే ఆ సినిమా ప్రకటన ఎంత వేగంగా వచ్చిందో, షూటింగ్ అంత నత్తనడకన సాగింది.
ఆశ్చర్యంగా హరీశ్ శంకర్ సినిమాను పక్కనపెట్టి మరీ మిగతా సినిమాలకు కాల్షీట్లు ఇచ్చారు పవన్ కల్యాణ్. ఈ సినిమా కంటే లేటుగా మొదలుపెట్టిన మూవీస్ ను తొందరగా పూర్తిచేశారు.
దీంతో ఒక దశలో హరీశ్ శంకర్ సినిమా ఆగిపోతుందనే పుకార్లు కూడా మొదలయ్యాయి. అయితే ప్రాజెక్టుకు టైటిల్ మార్చి ఫ్రెష్ గా మరోసారి ప్రకటించారు. తీసిన కొద్దిపాటి సన్నివేశాలతోనే గ్లింప్స్ కూడా రిలీజ్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు.
ఇలా పవన్-హరీశ్ సినిమా లేట్ అవ్వడం వెనక ఓ వ్యక్తి ఉన్నాడనే ప్రచారం ఇండస్ట్రీలో చాన్నాళ్లుగా ఉంది. పవన్ కు స్టోరీలు, కాంబినేషన్లు సెట్ చేయడం నుంచి, కాల్షీట్ల వ్యవహారం వరకు అన్నీ అతడే చూసుకుంటాడనే టాక్ ఉంది. ‘అతడు’ హరీశ్ సినిమాను అడ్డుకున్నాడనేది గట్టిగా వినిపించిన మాట. తాజాగా హరీశ్ శంకర్ దీనికి సమాధానమిచ్చాడు.
“ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వెనక్కి జరగడం వెనక రాజకీయాలున్నాయని నేను అనుకోను. నా మీద ఎప్పుడూ ఎలాంటి పాలిటిక్స్ జరగలేదని నా నమ్మకం. ఒకవేళ జరిగింది అనుకుందాం.. ఉస్తాద్ భగత్ సింగ్ ను ఆపి మరో వ్యక్తి, ఇంకో సినిమాను పట్టాలపైకి ఎక్కించాడనుకుందాం. అది అతడి నైపుణ్యత అని ఫీల్ అవుతా. నా కంటే బెటర్ గా హీరోను ఒప్పించాడు కాబట్టి నా సినిమా వెనక్కి వెళ్లి, అతడి సినిమా ముందుకొచ్చింది. కాబట్టి అది అతడి నైపుణ్యత.”
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కచ్చితంగా వస్తుందని హామీ ఇచ్చాడు హరీశ్. పవన్ నుంచి అభిమానులు ఆశించే అంశాలన్నీ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని, ఫ్యాన్స్ మళ్లీ మళ్లీ చూసేలా సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు.
నిన్న పిఠాపురంలో చొక్కాలు చించుకొని మేము కాపులమీ అని కొందరు కుర్రాళ్ళు గాంజా మత్తులో రోడ్ మీద కూటమి మంత్రికి గూటము దించారు…
సూపర్ సిక్స్ ప్లస్ అంటూ సంక నాకించారు…
వర్మ మీద దాడి చేసి స్నేక్ (బాబు) తో కరిపించారు…
కాపులకి ఊళ్ళల్లో తలెత్తుకోవాలంటే అవమానంగా వుంది…
కనీసం గెలిపించిన పిఠాపురం కాపులకి ఏమయినా చెయ్యండి.
జనం పట్టించుకోరు