పైరసీ ని తట్టుకునే హిట్ కావాలి

క్వాలిటీ సినిమాలు తీయడం మాత్రమే నిర్మాతలు చూసుకోవాలి. ఎందుకంటే కాలం మారిపోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వచ్చేసింది.

పైరసీ అనేది ఇప్పుడు కొత్తగా పుట్టుకువచ్చింది కాదు. జమానా కాలం నుంచి వుంది. అప్పుడూ సినిమాలు తట్టుకున్నాయి. ఇప్పుడూ తట్టుకున్నాయి. డిజిటల్ యుగం వచ్చిన తరువాత పైరసీ అనేదాన్ని రెండు విధాలుగా చూస్తున్నారు. ఒకటి గ్రౌండ్ లెవెల్ లో, దాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. రెండోది డిజిటల్ ఫార్మాట్‌లో, మూవీ రూల్స్ అనీ మరోటి అని సైట్లు, వాటి నుంచి డౌన్ లోడ్ లు. ఇవన్నీ ఎక్కువగా విదేశీ ప్రేక్షకులు వాడేవి. మన దగ్గర పైరసీ చూడడం అర్బన్ ఆడియన్స్ వరకు బాగా తగ్గిపోయింది. సెమీ అర్బన్, రూరల్‌లో కొంత వరకు వుంది. అర్బన్ లో మాత్రం పూర్తిగా క్వాలిటీ థియేటర్ ఎక్స్ పీరియన్స్ కోరుకుంటున్నారు.

అందువల్ల సినిమా రన్ ను పైరసీ డౌన్ చేసేస్తుందనే భయం అయితే ఇప్పుడు లేదు. అలాంటి భయం నిజమైతే బ్లాక్ బస్టర్లు రావు. మహరాజా లాంటి చిన్న సినిమా సైతం పైరసీ సమస్య లేకుండా ఆడేసింది. పుష్ప 2 ఎలా ఆడింది, సంక్రాంతికి వస్తున్నాం సంగతి తెలిసిందే. లక్కీ భాస్కర్ విజయం కూడా ఇదే సంగతి ప్రూవ్ చేసింది. ఇలా లిస్ట్ రాసుకుంటూ వెళ్తే పైరసీతో సంబంధం లేకుండా థియేటర్లలో వీరవిహారం చేసిన సినిమాలు చాలా వున్నాయి.

తండేల్ సినిమా యూనిట్ కేవలం పైరసీ మీద ప్రెస్ మీట్ పెట్టి, చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఆల్ మోస్ట్ పైరసీ కాపీ చూసిన వాళ్లను కూడా లోపల వేయిస్తాం అనే లెవెల్ లో మాట్లాడారు. నిజానికి ఇంత హడావుడి చేయక్కరలేదు. ఆన్ లైన్ పైరసీని డిజిటల్ టీమ్ చూసుకుంటుంది. రూరల్, సెమీ అర్బన్ పైరసీని చూసీ చూడనట్లు వదిలేయడమే.

ఒకపక్క వెబ్ సైట్లలో పైరసీ ప్రింట్ వచ్చిందని వార్తలు రాయద్దు. దాని వల్ల అందరికీ ఆసక్తి కలిగి మరింత డ్యామేజ్ అవుతుంది అంటారు. మరోపక్క వాళ్లే ప్రెస్ మీట్ పెట్టి మరీ పైరసీ కాపీని అక్కడ చూసారు, ఇక్కడ చూసారు. వాళ్లందరి మీద ఫిర్యాదు చేసాం అంటారు. వాళ్లే టముకు వేస్తే జనం పైరసీ కాపీ కోసం వెదకడం మొదలుపెడతారు కదా. పైరసీ కాపీని చూడడానికి గతంలో మాదిరిగా ప్రత్యేకించి పరికరాలు అక్కరలేదు. ప్రతి వాడి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ నే. దానికేమీ కేసులు పెట్టేయలేరు కదా.

అలా అని పైరసీని సపోర్ట్ చేయడం కాదు. దాన్ని అరికట్టే పని సైలంట్ గా డిజిటల్ టీమ్ లు చూసుకుంటాయి. క్వాలిటీ సినిమాలు తీయడం మాత్రమే నిర్మాతలు చూసుకోవాలి. ఎందుకంటే కాలం మారిపోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ వచ్చేసింది. ఇంకా చాలా చాలా మార్పులు చూడాల్సి వస్తుంది. వీటన్నింటిని సినిమా తట్టుకోవాలి. అలా తట్టుకునే రేంజ్ సినిమాలు రావాల్సి వుంటుంది.

6 Replies to “పైరసీ ని తట్టుకునే హిట్ కావాలి”

  1. Don’t say piracy not kill movie if it’s not there lot of success movies got 10 times more collection then now. especially concept based movies….

Comments are closed.