విశ్వం.. చాలా కీలకం

ఒక సినిమా హీరోకి కీలకం కావచ్చు, మరో సినిమా విజ‌యం దర్శకుడికి అవసరం కావచ్చు, ఇంకో సినిమా సక్సెస్ నిర్మాతకు తప్పని సరి కావచ్చు. కానీ ఒకే సినిమా విజ‌యం అలాంటి ముగ్గురికి చాలా…

ఒక సినిమా హీరోకి కీలకం కావచ్చు, మరో సినిమా విజ‌యం దర్శకుడికి అవసరం కావచ్చు, ఇంకో సినిమా సక్సెస్ నిర్మాతకు తప్పని సరి కావచ్చు. కానీ ఒకే సినిమా విజ‌యం అలాంటి ముగ్గురికి చాలా కీలకం కావడం అరుదుగా వుంటుంది. ఈవారం విడుదలవుతున్న విశ్వం సినిమా అలాంటిదే. ఈ సినిమాకు నిర్మాత పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్.. దర్శకుడు శ్రీనువైట్లు.. హీరో గోపీచంద్.

హీరో గోపీచంద్ కు గత పదేళ్లలో మహా అయితే ఒకటో రెండో, అది కూడా యావరేజ్‌ సినిమాలు వున్నాయి తప్ప హిట్ అన్నది కళ్ల చూడలేదు. గమ్మత్తేమిటంటే మరో హీరో ఎవరైనా ఈ పాటికి ఫేడవుట్ అయ్యేవారు. కానీ గోపీచంద్ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూనే వున్నారు. లౌక్యం సక్సెస్ తరువాత దాదాపు డజ‌ను సినిమాలు చేసారు. నిజంగా ఇది గ్రేట్ నే. నిర్మాతలు కుదేలవుతున్నా అఫర్లు రావడం. అందువల్ల ఇప్పుడు ఈ సినిమా హిట్ కొట్టాలి. లేదంటే ఇలాగే కలకాలం కొనసాగడం అంటే కష్టం. పైగా రాను రాను నాన్ థియేటర్ హక్కుల అదాయం తగ్గిపోతున్న రోజుల్లో మరీ కష్టం.

దర్శ‌కుడు శ్రీను వైట్ల సంగతి తెలిసిందే. గత పదేళ్లలో నాలుగు సినిమాలు చేస్తే.. అన్నీ ఫ్లాపులే, ఇది అయిదో సినిమా. ఇది హిట్ కావాలి. లేదంటే ఇక శ్రీను వైట్ల సినిమా జ‌ర్నీ క్లోజ్‌ అయిపోయే ప్రమాదం వుంది. అందువల్ల విశ్వం సినిమా కచ్చితంగా సక్సెస్ కావాలి.

ఇక నిర్మాత విశ్వప్రసాద్ వరుసగా సినిమాలు చేస్తున్నారు. కానీ విజ‌యాలు వరించడం లేదు. పైగా పెద్ద మొత్తంలో డబ్బు నష్టపోతున్నారు. ధమాకా తరువాత హిట్ లేదు. డబ్బులు బయటకు పోవడం తప్ప లోపలికి రావడం లేదు. ఇలాంటి టైమ్ లో విశ్వం సినిమా వస్తోంది. ఇది అయినా హిట్ అయితే కనీసం పరువు దక్కుతుంది.పైసల సంగతి తరువాత.

ఇలా ముగ్గురికి అవసరం పడిన విశ్వం సినిమా దసరాకు వస్తోంది. ఇది ఒక ప్లస్ పాయింట్. కానీ అయిదారు సినిమాలతో టఫ్ కాంపిటీషన్ లో విడుదల అవుతోంది. ఇది మైనస్ పాయింట్. చూడాలి ఏం జ‌రుగుతోందొ?

5 Replies to “విశ్వం.. చాలా కీలకం”

Comments are closed.