వాట్సాప్ డిలీట్ అంటే కుదర్దు భయ్యా!

వాట్సాప్‌ల్లో డబ్బుల లెక్కల చాటింగ్‌లు, డైలీ కలెక్షన్ రిపోర్టులు పంపడం అన్నీ బంద్ అయిపోతాయి.

వాట్సాప్ చాటింగ్ ఎన్‌క్రిప్టెడ్ – మూడో పార్టీకి తెలియదు. ఓకే.

వాట్సాప్ చాటింగ్ డిలీట్ చేసేస్తే ఫోన్ క్లీన్ అయిపోతుంది, సమస్యే లేదు. కానీ నాట్ ఓకే.

చాలా మంది ఏం చేస్తుంటారంటే వాట్సాప్‌లో మాట్లాడుకుంటారు, వాట్సాప్‌లో సమాచారం షేర్ చేసుకుంటారు. పని అయిన తరువాత “డిలీట్ ఫర్ ఆల్” అని ఒక్క టచ్‌తో క్లీన్ చేసేసుకుంటారు.

టాలీవుడ్‌లో చాలా మంది లాగే ఓ పెద్ద నిర్మాత కూడా ఇదే చేశారు. కానీ ఆదాయపన్ను శాఖ వాళ్లు ఇంకా నాలుగు చదువులు ఎక్కువే చదివి ఉంటారు కదా!

ఇటీవల టాలీవుడ్‌లో ఐటీ దాడులు జరిగాయి. ఓ కింగ్‌పిన్ మీద కూడా దాడులు జరిగాయి. వాట్సాప్ చూస్తే చాలా చోట్ల ఫుల్‌గా సర్ఫ్ వేసి కడిగేసినట్లు అనుమానం వచ్చింది.

దాంతో వాట్సాప్ అధికారులకు లేఖ రాస్తున్నట్లు తెలుస్తోంది. ఐటీ అధికారులు అడిగితే వాట్సాప్ అలా కోరిన సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని తెలుస్తోంది.

నియమనిబంధనలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాల్సి ఉంది. ఇదే కనుక పాజిబుల్ అయితే ఇక వాట్సాప్‌ల్లో డబ్బుల లెక్కల చాటింగ్‌లు, డైలీ కలెక్షన్ రిపోర్టులు పంపడం అన్నీ బంద్ అయిపోతాయి. అంతా ఓరల్‌గానే జరిగిపోతుంది వ్యవహారం.

2 Replies to “వాట్సాప్ డిలీట్ అంటే కుదర్దు భయ్యా!”

Comments are closed.