విజ‌యసాయి స్పందించ‌కుంటే.. జ‌గ‌న్ చెప్పిందే నిజం!

రాజ‌కీయాల నుంచి నిష్క్ర‌మించాన‌ని ప్ర‌క‌టించిన మాజీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స్పందించాల్సిన స‌మ‌యం ఇది.

రాజ‌కీయాల నుంచి నిష్క్ర‌మించాన‌ని ప్ర‌క‌టించిన మాజీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స్పందించాల్సిన స‌మ‌యం ఇది. ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల మీడియాతో మాట్లాడుతూ విజ‌య‌సాయిరెడ్డి త‌న‌తో అన్న‌ట్టుగా కీల‌క అంశాల్ని ప్ర‌స్తావించారు. అంత‌కు ముందు రోజు వైఎస్ జ‌గ‌న్ మీడియాతో మాట్లాడుతూ విజ‌య‌సాయిరెడ్డి వెళ్లిపోవ‌డంపై స్పందించారు. ఆ స్పంద‌న‌పై విజ‌య‌సాయిరెడ్డి కౌంట‌ర్‌గా ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

తాజాగా ష‌ర్మిల మీడియాతో మాట్లాడుతూ ఆస్తుల‌పై విజ‌య‌సాయిరెడ్డి త‌న‌తో అన్నార‌ని కొన్ని విష‌యాల్ని చెప్పారు. వీటిపై విజ‌య‌సాయిరెడ్డి స్పందించాలి. లేదంటే అవ‌న్నీ నిజ‌మే అని అనుకోవాల్సి వుంటుంది. అదే నిజ‌మైతే, విజ‌య‌సాయిరెడ్డి క్రెడిబిలిటీ, క్యారెక్ట‌ర్ విష‌యంలో జ‌గ‌న్ అన్న మాట‌లే నిజ‌మ‌ని జ‌నం న‌మ్మే ప‌రిస్థితి.

రెండు రోజులుగా జ‌గ‌న్‌, విజ‌య‌సాయిరెడ్డి, ష‌ర్మిల మ‌ధ్య సాగుతున్న రాజ‌కీయ క్రీడ ఏంటో తెలుసుకుందాం. ‘మ‌నంత‌కు మ‌న‌మే భ‌య‌ప‌డో, ఏదో కార‌ణం చేత‌నో మ‌న వ్య‌క్తిత్వాన్నో, విశ్వ‌స‌నీయ‌త‌నో బ‌లిపెట్ట‌డ‌మో, రాజీ అవుతూ పోతే గౌరవం ఏంటి? మ‌న క్యారెక్ట‌ర్ ఏంది?’ అని విజ‌య‌సాయిరెడ్డితో పాటు పార్టీ మారిన ఎంపీల‌పై జ‌గ‌న్ స‌మాధానం ఇచ్చారు. జ‌గ‌న్ కామెంట్స్‌పై విజ‌య‌సాయిరెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు.

‘వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువు అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నా’ అని విజ‌య‌సాయిరెడ్డి పోస్టు పెట్టారు.

మీడియాతో ష‌ర్మిల మాట్లాడుతూ ‘సాయిరెడ్డితో జరిగిన సమావేశంలో చాలా విషయాలు చర్చకు వచ్చాయి. జగన్‌ సొంత తల్లి మీద కేసు పెట్టించారు. నిజాలు వెల్లడిస్తూ ఆయన కుట్రను నేను బయటపెట్టాను. అవన్నీ అబద్ధాలని చెప్పాలంటూ సాయిరెడ్డిపై జగన్‌ ఒత్తిడి తెచ్చారు. ఆయనే స్వయంగా సాయిరెడ్డికి ఫోన్‌ చేసి… ప్రెస్‌మీట్‌ పెట్టాలన్నారు. అందుకు ఆయన నిరాకరించినా జగన్‌ ఒప్పుకోలేదు. తనను వదిలేయాలని సాయిరెడ్డి వేడుకోవడంతో వైవీ సుబ్బారెడ్డితో మాట్లాడించారు. తనకు ఇష్టంలేదని, కుదరదని సాయిరెడ్డి చెప్పినా జగన్‌ వినిపించుకోలేదు. సాయిరెడ్డి మాట్లాడాల్సిన అంశాలన్నీ స్వయంగా జగన్‌ నోట్‌ ఇచ్చారట! ఏం మాట్లాడాలో 40 నిమిషాలు డిక్టేట్‌ చేశారట’ అని షర్మిల వివరించారు.

ష‌ర్మిల కామెంట్స్‌పై ఇంత వ‌ర‌కూ విజ‌య‌సాయిరెడ్డి నుంచి ఎలాంటి స్పంద‌న లేదు. త‌న అభిప్రాయాలుగా ష‌ర్మిల చేసిన కామెంట్స్‌పై విజ‌య‌సాయిరెడ్డి స్పందించ‌క‌పోతే, జ‌గ‌న్ చెప్పిన‌ట్టు త‌ప్ప‌కుండా క్యారెక్ట‌ర్‌, క్రెడిబిలిటీపై ఎవ‌రికైనా అనుమానం వ‌స్తుంది. ఎంత‌గానో జ‌గ‌న్ న‌మ్మి, ద‌గ్గ‌ర పెట్టుకుని, కీలక విష‌యాల్ని విజ‌య‌సాయిరెడ్డితో పంచుకున్నారు. ఇప్పుడు వాట‌న్నింటిని తాను కాకుండా, ఇత‌రుల‌కు చెప్పి, వాటిని బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌జేయాల‌ని విజ‌య‌సాయిరెడ్డి ఏం ఆశించి చెప్పార‌నే ప్ర‌శ్న ఎదుర‌వుతుంది. కావున విజ‌య‌సాయిరెడ్డి త‌ప్ప‌కుండా స్పందించాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది.

22 Replies to “విజ‌యసాయి స్పందించ‌కుంటే.. జ‌గ‌న్ చెప్పిందే నిజం!”

  1. ఏమి రాసావురా రూథర్ఫోర్డ్? స్పందించకుంటే షర్మిల చెప్పింది నిజం అని…అప్పుడు షర్మిల , విజయమ్మ కి వ్యతిరేకంగా కుట్ర జరిగినట్లు ప్రూఫ్ అయినట్లేగా…అంటే కుటుంబ విలువలు జగన్ పాటించనట్లేగా? ఇప్పుడు విలువల గురించి జగన్ కు మాట్లాడే హక్కు ఎక్కడిది?

  2. ఓరి లేకి వెధవ…జగన్ పంచుకోలేదురా…ఆడిటర్ గా , మధ్యవర్తిగా , పెద్దమనిషిగా ఆ గొడవలో విజయ్ సాయి ఉన్నాడు, అంటే అన్ని విషయాలు ఆయనకు తెలిసే అవకాశం ఉంది. అయినా విజయమ్మకు , షర్మిల కి వ్యతిరేకంగా ప్రకటన జగన్ చేయించాడు అని ప్రూఫ్ అవుతుంది

  3. విలువలు, విస్వసనీయత, క్యరెక్టర్ … క్యా బాత్ హై!!

    .

    షర్మిల కి వ్యతిరెకంగా మాట్లాడక పొతె కి క్రడిబులిటి లెనట్టా?

    జగన్ కొసం అందరి పై ఇంకా మొరగపొతె విలువలు లెనట్టా?

    జగన్ కి బానిసత్వం చెయకపొతె క్యరెక్టర్ లెనట్టా?

    .

  4. ///భయం అన్నది నాలొ ఎ అనువు లొనూ లెదు!/// — మరొ గ్రామ సిమ్హం గాండ్రింపు!!

    .

    మోడీ మెడలు వంచి ప్రత్యెక హొదా తెస్తా అన్న సిమ్హం, ఐర్పొర్ట్ లొనె కాళ్ళ మీద పడింది!

    భయం అన్నది A1 కి లెదు A2 కి లెదు అంట. కాస్త నమ్మండి ప్లీజ్

    .

    ఇంత పిరికి సన్నాసులు సీమలొ ఎలా పుట్టారా?

  5. Shellemma already cheppindi kadaa GA, mana anniyya viluvalu, viswasaneeyatha gurinchi….😂😂😂…andaru nammuthunnaru kudaa…..so inka aa vi sa re tho malli thittinchukovadam yenduku GA..

  6. ఏయే స్క్యాముల్లో అన్నయ్య ఎంత మేశాడు లాంటి విషయాలు చెప్పలేదు కదా! ఆమె కుటుంబ ఆస్తులకు సంబంధించి విజయసాయి గతంలో ఇచ్చిన ప్రెస్ మీట్ లోని విషయాలు తాను స్వయంగా, స్వచ్చందంగా చెప్పినవి కాదని.. జగన్ ప్రోద్బలం వల్లనే తనకు ఇష్టం లేకపోయినా అలా మాట్లాడవలసి వచ్చిందని ఆమెను వ్యక్తిగతంగా కలసి వివరణ ఇచ్చుకొన్నాడు. ఇప్పుడు ఆ విషయాన్నే ఆమె బయటపెట్టింది. మళ్ళీ ఇప్పుడు విజయసాయి మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ అబద్దమైతే ఏదో ఒక ఫ్లాట్ ఫాం ద్వారా ఖండించవచ్చు. నిజమైతే స్పందించడు. పోనీ అన్నయ్యనే చెల్లి చేసిన ఆరోపణలను ఖండించమను.

    ఇప్పుడు అన్నయ్య విలువలు, విశ్వసనీయత బజారులో బట్టలు లేకుండా నిలబడి ఉంది. స్పందించాల్సింది అన్నయ్యే!

  7. ఒరేయ్ పనికిమాలినోడా..

    విజయ సాయి రెడ్డి క్రెడిబిలిటీ గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.. వాడు షర్మిల తో చెప్పింది నిజమా.. కాదా అనేది మాత్రమే జనాలు డిసైడ్ చేసుకొంటారు..

    ..

    నువ్వు అత్యుత్సాహం తో జగన్ రెడ్డి విజయ సాయి రెడ్డి తో చెప్పిన విషయాన్ని ఇతరులతో పంచుకున్నాడు అంటూ.. జగన్ రెడ్డి క్రెడిబిలిటీ ని .. అతని డబ్బు పిచ్చి ని .. నువ్వే బయట పెట్టేసుకొంటున్నావు..

    ..

    అయితే జగన్ రెడ్డి కి కూడా క్రెడిబిలిటీ లేనట్టేనా.. నీ రాతల్లో అదే అర్థం వస్తోంది మరి..

    లేదంటే.. నీ రాతలకు క్రెడిబిలిటీ లేదని.. నువ్వే ఒప్పుకుని.. లెంపలేసుకోవాలి..

  8. తల్లీ షెల్లీ మొహం మీద ఊసిన నవ్వుతున్నాడంటే షర్మిల చెప్పిందే నిజం!!

  9. ప్రజల డ*బ్బు నీ బాగా మెక్కే*సి, రోజుకీ లక్ష ఎగ్ పఫ్ లు తినీ కట్టిన ప్యాల*స్ లో జ*గన్ వున్నాడు.

    అతని త*ల్లి ఆ ప్యా*లస్ లో లేదు.

    వివే*క కి జరిగిన సంగతి చూసి ఎన్నికల ముందు తన ప్రా*ణం కాపా*డుకోడానికి అమె*రికా వెళ్లి మరి జా*గ్రత్త పడా*ల్సి వచ్చింది.

    అ*తని కోసం ఎం*డల్లో ప్రచారం చేసిన చె*ల్లి కి ఇవ్వా*ల్సిన విలు*వ ఇవ్వలేదు.

    3*AM కి మా*త్రం విన్యా*సం కి సక*ల మర్యా*దలు జరు*గుతున్నాయి.

Comments are closed.