బాలయ్య మరోసారి మైక్ పుచ్చుకుంటారా?

ఈ సంగీత విభావరిలో బాలయ్యతో పాడించే ప్రయత్నం చేస్తానని ప్రకటించేశాడు తమన్.

బాలయ్య మైక్ పట్టుకుంటే ఏమౌతుందో అందరికీ తెలిసిందే. ఆయన ప్రసంగాలు ఎక్కడో మొదలై, ఎక్కడో ముగుస్తాయి. మధ్యలో ‘మా నాన్న గారు’ అంటూ ఇంకేదో మాట్లాడుతుంటారు. ఇక ఈయన పాటలందుకుంటే ఆ లెక్కే వేరు. “నీకు నచ్చకపోయినా నేను పాడతా” అన్నట్టుంటుంది ఈయన వ్యవహార శైలి.

ఇలాంటి బాలయ్య ఇప్పుడు మరోసారి మైక్ అందుకునే సందర్భం వచ్చింది. త్వరలోనే ‘యుఫోరియా’ పేరిట ఓ కన్సర్ట్ పెడుతున్నాడు తమన్. ఈ ఛారిటీ కాన్సర్ట్ ఏర్పాటుచేస్తోంది ఎవరో తెలుసా? స్వయంగా బాలకృష్ణ సోదరి నారా భువనేశ్వరి.

ఈ సంగీత విభావరిలో బాలయ్యతో పాడించే ప్రయత్నం చేస్తానని ప్రకటించేశాడు తమన్. హీరోలతో పాటలు పాడించడం ఆయన హాబీ మరి. నిజానికి ఆయన ప్రకటించాల్సిన అవసరం లేదు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ తప్పనిసరిగా హాజరవుతారు. తన కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన పాటందుకోవడం కూడా అంతే ఖాయం.

ఈనెల 15న విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ మ్యూజికల్ నైట్ కార్యక్రమం ఉంటుంది. ఇందులోకి రావాలంటే ఎవరైనా టికెట్ తీసుకోవాల్సిందే. చివరికి చంద్రబాబు అయినా సరే. అలా వచ్చిన నిధుల్ని తలసేమియా బాధితుల కోసం వినియోగిస్తారు. ఓ మంచి కార్యక్రమం కాబట్టి బాలయ్య పాడాల్సిందే.

18 Replies to “బాలయ్య మరోసారి మైక్ పుచ్చుకుంటారా?”

  1. బాలయ్య కడప dist fan ప్రెసిడెంట్, అదే “ఆంధ్రా ఐటమ్” గాడు పాడితే.. తన కోడలు సోనియా ని ఎదురించిన సింగల్ సింహాన్ని, ఇందిరాగాంధీ ఆత్మ గా వచ్చి అభినందిస్తుంది. ఏమంటారు??

      1. Chandu garu due to people like you jagan goru got 11 you are helping kutami all other communities are united and gave 11 for jagan goru due to people like. Why you are doing this to jagan goru see sharmila garu

      2. Chandu garu due to people like you jagan goru got 11 you are helping kutami all other communities are united and gave 11 for jagan goru due to people like. Why you are doing this to jagan goru see sharmila garu

  2. భారతి రెడ్డి , అవినాష్ రెడ్డి , పెద్ద కారవాన్ లో వస్తున్నారట కదా? మన 11 రెడ్డి ఏమో బెంగుళూర్ లో , భారతి రెడ్డి మాత్రం ఏమీ చేస్తలేదే పాపం ఎవడనో ఒకడిని ఉంచోకవలి కదా .

Comments are closed.