కేకే స‌ర్వే అట్ట‌ర్ ప్లాప్‌!

ఢిల్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై కేకే స‌ర్వే వెల్ల‌డించిన ఫ‌లితాలు పూర్తిగా రివ‌ర్స్ అయ్యాయి.

ఢిల్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై కేకే స‌ర్వే వెల్ల‌డించిన ఫ‌లితాలు పూర్తిగా రివ‌ర్స్ అయ్యాయి. ఢిల్లీలో మ‌ళ్లీ ఆప్ 44 సీట్ల‌తో అధికారంలోకి వ‌స్తుంద‌ని కేకే వెల్ల‌డించారు. అలాగే బీజేపీకి 26 సీట్లు ద‌క్కుతాయ‌ని కేకే స‌ర్వే వెల్ల‌డించింది. అయితే 46 చోట్ల బీజేపీ ఆధిక్య‌త‌లో కొన‌సాగుతోంది. ఆప్ 24 సీట్ల‌తో ప్ర‌స్తుతానికి ముందంజ‌లో వుంది. దీంతో కేకే చెప్పిన వాటికంటే ఆప్ స‌గానికి స‌గం సీట్లు త‌గ్గుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఏపీ ఎన్నిక‌ల్లో కూట‌మికి 160కి పైగా సీట్లు వ‌స్తాయ‌ని కేకే వెల్ల‌డించిన స‌ర్వే ఫ‌లితాలు నిజం అయ్యాయి. అప్ప‌టి నుంచి కేకే స‌ర్వే సంస్థ పేరు మార్మోగింది. అయితే ఆ త‌ర్వాత హ‌ర్యానా ఫ‌లితాల్లో కేకే స‌ర్వే సంస్థ అంచ‌నాలు త‌ప్ప‌య్యాయి. కానీ మ‌హారాష్ట్ర‌లో మ‌ళ్లీ నిజ‌మై, ఆయ‌న విశ్వ‌స‌నీయ‌త‌ను నిల‌బెట్టుకున్నారు.

ఈ నేప‌థ్యంలో ఢిల్లీ ఫ‌లితాల‌పై ఎన్నిక‌ల అనంత‌రం కేకే వివ‌రాలు వెల్ల‌డించారు. ఏఏ నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రెవ‌రు గెలుస్తారో కూడా ఆయ‌న జిల్లాల వారీగా అంచ‌నా వేశారు. కానీ ఆయ‌న చెప్పిన దానికి, వాస్త‌వ ఫ‌లితాల‌కు పొంత‌న లేకుండా పోయింది. పూర్తి రివ‌ర్స్ కావ‌డం కేకే స‌ర్వే సంస్థ అంచ‌నాపై పెద‌వి విరిచే ప‌రిస్థితి ఏర్ప‌డింది.

కానీ ఎక్కువ స‌ర్వే సంస్థ‌లు బీజేపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని చెప్పాయి. కానీ కేకే స‌ర్వే ఏపీలో, మ‌హారాష్ట్ర‌లో వేసిన అంచ‌నాలు విజ‌య‌వంతం కావ‌డంతో, ఢిల్లీ ఫ‌లితాలు ఎలా వుంటాయో అని ఆస‌క్తిగా ఎదురు చూశారు. కానీ కేకే చెప్పిన ఫ‌లితాల్లో బీజేపీకి చెప్పిన సంఖ్య ఆప్‌, అధికార పార్టీకి వ‌స్తాయ‌న్న సీట్ల కంటే మ‌రికొన్ని ఎక్కువ‌గా బీజేపీకి వ‌స్తుండ‌డం విశేషం. త‌న అంచ‌నా త‌ప్పు కావ‌డంపై కేకే ఏమంటారో మ‌రి!

10 Replies to “కేకే స‌ర్వే అట్ట‌ర్ ప్లాప్‌!”

  1. కేకే సర్వే.. 2019 లో కూడా అట్టర్ ప్లాప్ కావాల్సింది..

    అప్పుడు కేకే ఓడిపోయి ఉంటె.. రాష్ట్రం గెలిచేది.. ఇప్పటికి ఎంతో అభివృద్ధి చెంది ఉండేది..

      1. Mr Babu garu do you have any shame due to people like YOU jagan goru got 11/175. You are actually helping KUTAMAI what is this nonsense of kammaravati. Focus on Sharmila finance dispute with JAGAN GORU

      2. ఓకే.. బొక్క బాబు కి ఒక ఛాలెంజ్..

        నీ జగన్ రెడ్డి మళ్ళీ మూడు రాజధానులు అంటాడా..? లేక ఈ అమరావతే రాజధాని అంటాడా..?

Comments are closed.