పూరి జగన్నాధ్ దగ్గర 4 కథలు సిద్ధంగా ఉన్నాయంట. అందులో ఏ కథతో ముందుకెళ్లాలా అని ఆలోచిస్తున్నాడట. రచయిత కోన వెంకట్ బయటపెట్టిన మేటర్ ఇది. పూరిలో టాలెంట్ కు కొదవ లేదని, అతడు కచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతాడనేది ఈయన మాట.
చెప్పుకోడానికి బాగుంది కానీ, వాస్తవ పరిస్థితి అలా ఉందా అని ప్రశ్నించుకుంటే మాత్రం నెగెటివ్ సమాధానమే వస్తుంది. కథలు అందరి దగ్గర ఉంటాయి, అదే విధంగా పూరి జగన్నాధ్ దగ్గర కూడా ఉన్నాయి. కానీ ఆయనకు ఛాన్స్ ఇచ్చేది ఎవరనేది ఇక్కడ ప్రశ్న.
గోపీచంద్ తో కలిసి అతడు సెట్స్ పైకి వెళ్తాడంటూ గతంలో కథనాలొచ్చాయి. కానీ దానిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇప్పుడేమో సీనియర్స్ వైపు చూస్తున్నాడంటూ కథనాలు.
సీనియర్లలో చిరంజీవి దగ్గరకు పూరి వెళ్లే ఛాన్స్ లేదు. ఆల్రెడీ ఆటోజానీ ప్రాజెక్టు ఆగిపోయింది. మరో కథతో కలుద్దామన్నా కూడా చిరంజీవి బిజీగా ఉన్నారు. వెంకీ-పూరి కాంబినేషన్ కూడా కష్టమే. ఇద్దరికీ ఎందుకో సింక్ అవ్వడం లేదు.
లిస్ట్ లో నాగార్జున, బాలకృష్ణ ఉన్నారు. బాలకృష్ణ దగ్గర పూరి జగన్నాధ్ కు ఓపెన్ ఆఫర్ ఉంది. ఎప్పుడైనా బాలయ్యతో ఆయన సినిమా చేయొచ్చు. కానీ ఆ ట్రంప్ కార్డు కంటే ముందు, ఇంకేదైనా ట్రై చేయాలని పూరి భావిస్తున్నట్టు కనిపిస్తోంది.
నాగార్జున-పూరి కలిస్తే బాగుంటుంది, గతంలో వీళ్లది హిట్ కాంబినేషనే. కాకపోతే ఇప్పుడు మార్కెట్, బడ్జెట్ లెక్కలు చూసుకుంటే ఈ కాంబినేషన్ వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు. సో.. పూరి దగ్గర కథలు రెడీగా ఉండొచ్చు కానీ ఓ హీరోను పట్టుకొని, అతడితో హిట్ కొట్టడం అనేది ఈసారి అంత ఈజీ టాస్క్ కాదు.
Waiting
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Puri–nagarjuna combination blockbuster avthundhi