ఓ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలుంటాయి. మరి అలాంటి ప్రాజెక్ట్ ను ఎలా ప్రకటించాలి? ఎక్కువమంది సింపుల్ గా ట్విట్టర్ లో ప్రకటించి ఊరుకుంటారు. ఆల్రెడీ క్రేజ్ ఉంది కాబట్టి అసలు ఎనౌన్స్ చేయాల్సిన అవసరం లేదనుకుంటారు మరికొంతమంది. ఇలాంటి వాళ్లంతా జైలర్-2 ప్రకటన చూడాలి.
రజనీకాంత్ హీరోగా రాబోతున్న జైలర్-2 సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాల్ని రెట్టింపు చేసేలా ఈరోజు ఎనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్ చేశారు. ఓ టీజర్ కు, ఇంకా చెప్పాలంటే ఓ ట్రయిలర్ కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది ఈ ఎనౌన్స్ మెంట్ వీడియో.
ఏదో ఇలా ప్రకటించి అలా చేతులు దులుపుకున్నాం అన్నట్టు కాకుండా.. రజనీకాంత్ తో భారీగా షూటింగ్ చేసి మరీ ఈ వీడియో విడుదల చేయడం విశేషం. కేవలం సినిమా ప్రకటనకే మేకర్స్ ఎంత కష్టపడ్డారో, ఎంత ఖర్చుపెట్టారో ఈ వీడియో చూస్తే మీకే అర్థమౌతుంది.
టైగర్ కా హుకుం అంటూ ఓ చేతిలో గన్, మరో చేతిలో కత్తి పట్టుకొని, చొక్కాపై రక్తపు మరకలతో రజనీకాంత్ ఎంట్రీని కూడా చూపించారు. నెల్సన్ దర్శకత్వంలో రాబోతోంది జైలర్-2. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు