ఆ విషయంలో రికార్డు సృష్టించిన కల్కి

గరుడవేగ సినిమాకు ముందు, ఆ సినిమా తర్వాత అన్నట్టు మారింది రాజశేఖర్ మార్కెట్. ఆ సినిమా ప్రభావం ఈ హీరో కెరీర్ పై స్పష్టంగా కనిపిస్తోంది. తను సొంతంగా రెమ్యూనరేషన్ పెంచుకోవడానికి సహాయపడ్డమే కాకుండా……

గరుడవేగ సినిమాకు ముందు, ఆ సినిమా తర్వాత అన్నట్టు మారింది రాజశేఖర్ మార్కెట్. ఆ సినిమా ప్రభావం ఈ హీరో కెరీర్ పై స్పష్టంగా కనిపిస్తోంది. తను సొంతంగా రెమ్యూనరేషన్ పెంచుకోవడానికి సహాయపడ్డమే కాకుండా… కల్కి బిజినెస్ విషయంలో కూడా గరుడవేగ బాగా ప్లస్ అయింది.

కల్కి సినిమా థియేట్రికల్ రైట్స్ హోల్ సేల్ గా అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. ఇక తాజాగా శాటిలైట్, డిజిటల్ డీల్స్ కూడా కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. గరుడవేగ సినిమా విడుదలై, హిట్ అయినంతవరకు శాటిలైట్ రైట్స్ ఎవరూ కొనలేదు. కానీ కల్కి మాత్రం విడుదలకు ముందే ఈ విషయంలో బిజినెస్ పూర్తిచేసింది.

కల్కి సినిమా శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా ఛానెల్ దక్కించుకుంది. అటు ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ రెండు ఒప్పందాల విలువ దాదాపు 6 కోట్ల రూపాయలుగా తెలుస్తోంది. ఇక సినిమా హిందీ డబ్బింగ్, శాటిలైట్ రైట్స్ ను చాన్నాళ్ల కిందటే మంచి రేటుకు అమ్మేసిన సంగతి తెలిసిందే.

ఇలా కల్కి సినిమాకు సంబంధించి పూర్తిగా సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయారు నిర్మాతలు. గరుడవేగ రిలీజ్ టైమ్ లో జీవిత ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఈసారి అంత హ్యాపీగా బిజినెస్ పూర్తిచేయగలిగారు. ప్రశాంత్ వర్మ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమా 28న థియేటర్లలోకి వస్తోంది.

ప్రయత్నాలు ఆపని అఖిలప్రియ.. మరి జగన్ కరుణిస్తాడా?