వందల కోట్ల బడ్జెట్ తో నిర్మాణమైంది కల్కి సినిమా. మరో మూడు రోజుల్లో విడుదలకు రెడీ అవుతోంది. ఈ మధ్య ఏ సినిమా అయినా ఓటిటిలో వస్తుందిలే అనే ధీమా ఎక్కువగా వుంటోంది చాలా మంది ప్రేక్షకుల్లో. పైగా విడుదలైన వారం నుంచి నాలుగు వారాల లోపు ఓటిటి లోకి వచ్చేస్తోంది.
కానీ కల్కి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నామని, 56 రోజుల వరకు ఓటిటి లోకి రాదని యూనిట్ వర్గాల బోగట్టా. అలాగే వీలయినంత వరకు అర్థరాత్రి, ఒంటిగంటకు షోలు లేకుండా జాగ్రత్త పడుతున్నారట. నిద్ర కళ్లతో, సింగిల్ థియేటర్లలో అర్థరాత్రి సినిమా చూడడం, ఇలా వుంది అలా వుంది అంటూ టాక్ స్ట్రెడ్ చేయడం అవసరమా? అనే ఆలోచనలో వుందట యూనిట్.
అయిదు గంటల నుంచే షో లు ఎక్కువగా పడతాయని తెలుస్తోంది. అనివార్యం అయితే కొన్ని చోట్ల అర్థరాత్రి దాటిన తరువాత ఒకటి రెండు షో లు పడే అవకాశం వుందంటున్నారు. ఎన్ని షో లు, ఎప్పటి నుంచి వుంటాయి, రేట్లు వగైరా విషయాలు అన్నీ సోమవారం నాడు క్లారిటీ వస్తుంది. ప్రభుత్వాల నుంచి శనివారం లేదా సోమవారం జివో వస్తుందని, అవి వచ్చిన తరువాతే బుకింగ్ లు ఓపెన్ చేస్తారని తెలుస్తోంది.
ప్రస్తుతం యూనిట్ ఫినిషింగ్ పనుల్లో బిజీగా వుంది. ఐమ్యాక్స్ వెర్షన్ పంపడం, మిక్సింగ్, లోడింగ్ ఇలాంటి వాటిలో బిజీగా వున్నారు.