గడిచిన వారం, పది రోజులుగా కత్రినా కైఫ్ పై నడిచిన పుకార్లు అన్నీ ఇన్నీ కావు. ఆమె గర్భం దాల్చినట్టు బాలీవుడ్ మీడియా కోడై కూసింది. దొరికిన ఒక్క ఫొటోను చూపించి, ఆమె కడుపుతో ఉందని చెప్పుకొచ్చింది. ఇంకొంతమంది మరో అడుగు ముందుకేసి, లండన్ కు చెందిన కత్రినా కైఫ్, అక్కడే బిడ్డకు జన్మనిస్తుందని కూడా రాసుకొచ్చారు.
కట్ చేస్తే, కత్రినా కైఫ్ ఫ్లాట్ పొట్టతో కనిపించింది. విదేశీ పర్యటన ముగించి ఇండియాకొచ్చిన కత్రినా కైఫ్.. ఎయిర్ పోర్టులో ఫొటోలకు పోజులిచ్చింది. ఆమె గర్భం దాల్చలేదనే విషయం ఆ ఫొటోలు చూస్తే అర్థమౌతుంది.
తను గర్భం దాల్చినట్టు దీపిక పదుకోన్ ప్రకటించింది. ఆమె ప్రకటించిన కొన్ని రోజులకే కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అంటూ కొంతమంది పుకార్లు రేపారు. భర్త విక్కీ బర్త్ డేను సెలబ్రేట్ చేసేందుకు లండన్ వెళ్లింది కత్రినా. అక్కడ దిగిన ఫొటోలు కొందర్లో అనుమానాలు రేకెత్తించాయి
2021లో విక్కీ కౌశల్, కత్రినాకైఫ్ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం కత్రినా కైఫ్, పూర్తిస్థాయిలో తన కెరీర్ పై మాత్రమే దృష్టి పెట్టింది. గతేడాది టైగర్-3లో నటించిన ఈ బ్యూటీ, ఈ ఏడాది మెర్రీ క్రిస్మస్ సినిమాను రిలీజ్ చేసింది.