కోడిపుంజు హీరోగా ర‌మేష్‌వ‌ర్మ సినిమా

గోదావ‌రి యాస బాగా ప‌ల‌క‌గ‌లిగిన వాళ్లే ఎక్కువ‌గా న‌టిస్తార‌ని తెలుస్తోంది.

మూడేళ్ల క్రితం ర‌వితేజ‌తో ఖిలాడి తీసిన ర‌మేష్‌వ‌ర్మ ఇపుడు మ‌ళ్లీ నిర్మాత‌గా మారారు. ఖిలాడి ఘోర ప్లాప్‌ త‌ర్వాత రాక్ష‌సుడు 2 తీయాల‌నుకున్నారు. అది స్క్రిప్ట్ ద‌శ‌లోనే ఆగిపోయింది. గ్యాప్ త‌ర్వాత కోడిపందేల నేప‌థ్యంలో గోదావ‌రి యాస‌తో కొక్కొరోకో అనే సినిమా ప్లాన్ చేశారు. ప‌లు సినిమాల‌కి అసోసియేట్‌గా ప‌ని చేసిన శ్రీ‌నివాస్ వ‌సంతాల‌ మొద‌టిసారి ద‌ర్శ‌కుడు కాబోతున్నాడు.

ఈ నెల 27, 28 తేదీల్లో భీమ‌వ‌రంలో ఆడిష‌న్స్ చేస్తున్నారు. గోదావ‌రి యాస బాగా ప‌ల‌క‌గ‌లిగిన వాళ్లే ఎక్కువ‌గా న‌టిస్తార‌ని తెలుస్తోంది. ఒక కోడిపుంజు చుట్టూ తిరిగే నాలుగు క‌థ‌ల స‌మాహార‌మే సినిమా.

త‌మాషా ఏమంటే పెనుమ‌త్స ఇంటి పేరుతో ముగ్గురు డైరెక్ట‌ర్లున్నారు. ముగ్గురూ డిఫ‌రెంటే. మొద‌టి వ్య‌క్తి రాంగోపాల్ వ‌ర్మ‌. ఒకప్పుడు ఒక రేంజ్‌లో ఉన్న వ‌ర్మ త‌ర్వాత జోక‌ర్ స్థాయికి ప‌డిపోయాడు. యూట్యూబ్ ఇంట‌ర్వ్యూలు, డిజాస్ట‌ర్ సినిమాల‌కి కేరాఫ్ అయ్యాడు. కాక‌పోతే మూడు ద‌శాబ్దాల త‌ర్వాత కూడా ఇంకా వార్త‌ల్లోనూ , ఫీల్డ్‌లోనూ వున్నాడు.

రెండో వ్య‌క్తి ర‌మేష్ వ‌ర్మ‌, 2005లో ఒక ఊరిలో సినిమాతో ద‌ర్శ‌కుడు అయ్యాడు. త‌ర్వాత 8 సినిమాలు తీసాడు. వీటిలో రెండింటికి కేవ‌లం నిర్మాత. ఒక బ్లాక్‌బ‌స్ట‌ర్ కూడా లేదు. రాక్ష‌సుడు హిట్ అయ్యింది. కానీ అది మొత్తం త‌మిళ సినిమా. ఒక ర‌కంగా సెమీ డ‌బ్బింగ్‌. ఒక సినిమా పోతేనే అడ్ర‌స్ లేకుండా పోయే ఇండ‌స్ట్రీలో 20 ఏళ్ల‌పాటు వుంటూ 8 సినిమాలు తీసాడు. అదీ కాకుండా కిల్‌ని లారెన్స్‌తో రెండు భాష‌ల్లో ప్లాన్ చేసాడు. నిజానికి కిల్ తెలుగు డ‌బ్బింగ్ కూడా అంద‌రూ చూసేశారు. అయినా వ‌ర్మ ధైర్యం వేరు. రాంగోపాల్ వ‌ర్మ ప్రేర‌ణ కావ‌చ్చు.

జ‌పాన్ వెబ్ సిరీస్‌ని కోట్లు పెట్టుకుని హిందీలో తీసే ప్ర‌య‌త్నంలో వున్నాడు. విక్ర‌మ్‌తో త‌మిళ్‌, తెలుగు సినిమా ప్లానింగ్‌లో వుంది. మూడేళ్లుగా ఒక్క సినిమా కూడా తీయ‌కుండా హ‌ఠాత్తుగా ఇన్ని ప్లాన్ చేయ‌డం పిస‌రంత వెర్రికి నిద‌ర్శ‌నం కావ‌చ్చు.

మూడో వ్య‌క్తి ప్ర‌శాంత్ వ‌ర్మ‌. “ఆ” సినిమాతో వెలుగులోకి వ‌చ్చి క‌ల్కి ప్లాప్‌తో వెనుక‌బ‌డి జాంబిరెడ్డితో ముందుకొచ్చి హ‌నుమాన్‌తో దూసుకెళ్లాడు. ఏడాది నుంచి అదిగో ఇదిగో అన‌డ‌మే త‌ప్ప సినిమా స్టార్ట్ కాలేదు. ఒక ద‌శ‌లో నంద‌మూరి మోక్ష‌జ్ఞ పేరు వినిపించింది. అంద‌రూ ఎదురు చూస్తున్నా తెమిల్చేలా లేడు. ఏమైనా పెనుమ‌త్స ఇంటి పేరు వున్న డైరెక్ట‌ర్లు డిఫ‌రెంట్‌. ముగ్గురి కామ‌న్ ల‌క్ష‌ణం వేప‌కాయంత వెర్రి.

6 Replies to “కోడిపుంజు హీరోగా ర‌మేష్‌వ‌ర్మ సినిమా”

  1. పాతికేళ్ళుగా పోస్టర్లు చేసుకుంటున్నాదు.. చివరికి వీడి పోస్టర్ కి దండ పడే దాకా ఆగడు

  2. తల్లిని, చెల్లిని అగౌరవపరిచిన నేతకు గౌరవం ఎక్కడ? గ్రామాల నుంచి జగన్‌కు ఘోర తిరస్కారం!

    ఒకప్పుడు “మామయ్య” అంటూ ప్రేమగా పిలిచిన మహిళలు, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పేరు వినగానే జాల్రాలు వేస్తున్నారు. ఇంట్లో ఒకరిలా కనిపించిన వ్యక్తి, ఆ ఇంటినే నాశనం చేసాడన్న భావన ఇప్పుడు గ్రామాల్లో బలంగా నెలకొంది. తన తల్లిని కోర్టుకు లాగిన వాడిని మన నాయకుడిగా ఎలా అంగీకరిస్తాం అని ఆడవాళ్లు గళమెత్తుతున్నారు. కుటుంబానికి గౌరవం లేని వాడికి ప్రజలకు ఏమాత్రం గౌరవం ఉంటుంది?

    గ్రామాల్లో ఇది ఏకవాక్యం: “మనం మోసపోయాం… ఇక మళ్లీ కాదు!” జగన్ వేసిన నాటకాలన్నీ బహిరంగమయ్యాయి. సంక్షేమం పేరుతో ఓట్లు గెలవడం మాత్రమే ఆయన లక్ష్యమని ప్రజలు ఎట్టకేలకు గుర్తించారు. అల్లరి మాటలతో ఆకర్షించిన రోజులే గడిచిపోయాయి. ఇప్పుడు ప్రజలు విషయాన్ని తలచుకొని మాడిపోతున్నారు.

    తల్లిని తక్కువ చేస్తే మనిషికి మానవత్వమే లేదని చెప్పే తెలుగు సంస్కృతిని తునాతునకలు చేసిన జగన్ పట్ల ఇప్పుడు గ్రామాల మన్ననే కాదు, మనస్సు కూడా పూర్తిగా తిరస్కరించింది. “ఎవడైనా గెలవాలి కానీ… ఇలాంటోడు కాదు” అన్న మాటలు ఆ వృద్ధుల నోటి నుంచి కూడా వినిపిస్తున్నాయి. ఒక్క కుటుంబం నడిపించలేని వాడిని రాష్ట్రం నడిపించడానికి ఎలా నమ్ముతాం?

    పార్టీ నాయకత్వంలో విభేదాలు, క్యాడర్‌కి గల వైముఖ్యాన్ని వేరే కోణంగా చూడాల్సిన అవసరం లేదు. అది జగన్‌ పట్ల ప్రజల్లోని అసహనం ప్రతిబింబమే. ఇప్పటికే 40 శాతం పైగా పార్టీ శ్రేణులు పార్టీని విడిచి వెళ్లిపోవడం యాదృచ్ఛికం కాదు. అది ప్రజలు తీర్పునిచ్చిన తర్వాత జరుగుతున్న సహజ పరిణామం.

    ఇప్పటికి గ్రామాల్లో ప్రజలు చెప్పేది ఒక్కటే—తల్లిని అగౌరవపరిచిన, చెల్లిని అపహాస్యం చేసిన వాడికి ఓటు వేయడమంటే… మా తల్లులను, చెల్లెల్లను అవమానపరచినట్టు అవుతుంది. ఇది రాజకీయ తిరస్కారం కాదు… ఇది నైతిక తిరుగుబాటు. జగన్ మళ్ళీ వచ్చిన రాస్తా కాదు… ఇదే చివరి దారి!

Comments are closed.