ముంబ‌య్ న‌టి కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ అరెస్ట్‌

ముంబ‌య్ న‌టి జత్వానీ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజ‌నేయుల్ని ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.

ముంబ‌య్ న‌టి జత్వానీ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజ‌నేయుల్ని ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. వైసీపీ హ‌యాంలో ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజ‌నేయులు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా విధులు నిర్వ‌ర్తించారు. ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త ఫిర్యాదు మేర‌కు ముంబ‌య్ న‌టిపై వైసీపీ ప్ర‌భుత్వం కేసు పెట్టింది.

న‌టి జ‌త్వానీతో పాటు ఆమె కుటుంబ స‌భ్యుల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి, విజ‌య‌వాడ‌కు తీసుకొచ్చారు. అయితే కేసు వెనక్కి తీసుకోవాలంటూ జ‌త్వానీతో పాటు ఆమె కుటుంబ స‌భ్యుల‌పై ముగ్గురు ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, సీపీ కాంతి రాణాటాటా, విశాల్ గున్ని తీవ్ర ఒత్తిడి చేసిన‌ట్టు ఆరోప‌ణ‌లున్నాయి. కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత జ‌త్వానీతో వాళ్ల‌పై ఫిర్యాదు చేయించారు.

ఈ మేర‌కు ఐపీఎస్ అధికారుల‌పై కూట‌మి ప్ర‌భుత్వం కేసు న‌మోదు చేసింది. అంతేకాదు. డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణంరాజుపై థ‌ర్డ్ డిగ్రీ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఆంజ‌నేయులు నిందితుడు. అయితే త‌మ‌ను అరెస్ట్ చేసే అవ‌కాశం వుంద‌ని, ఉప‌శ‌మ‌నం క‌ల్పించాల‌ని కోరుతూ ఆంజ‌నేయులు మిన‌హా మిగిలిన ఇద్ద‌రు ఐపీఎస్ అధికారులు ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు. వాళ్లిద్ద‌రికీ ముంద‌స్తు బెయిల్ ల‌భించింది. అయితే ఆంజ‌నేయులు మాత్రం కోర్టును ఆశ్ర‌యించ‌లేదు. ఇదే విష‌యాన్ని ఒక సంద‌ర్భంలో న్యాయ‌స్థానం కూడా ప్ర‌స్తావించింది.

మ‌రోవైపు ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారుల‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో వుంటున్న ఆంజ‌నేయుల్ని సీఐడీ అధికారులు మంగ‌ళ‌వారం అరెస్ట్ చేయ‌డం గ‌మ‌నార్హం. రానున్న రోజుల్లో ఏం జ‌రుగుతుంద‌నే అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

9 Replies to “ముంబ‌య్ న‌టి కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ అరెస్ట్‌”

  1. అన్నియ్య మట్ట ఒక రేంజ్ లో కుడిసినందుకు తప్పదు మరి ఐ.పీ.ఎస్ అయినా ..

  2. వీడు పెద్ద బోకు గాడు అని పోలీసు లలో అందరికీ ఎప్పుడో తెలిసిన బహిరంగ విషయం.

    కాని వీడిని నమ్మి ఒకపుడు మంచిగా ఉండే వేరే ips విశాల్ గిన్ని కూడా చంక నాకిపోయాడు.

  3. తల్లిని, చెల్లిని అగౌరవపరిచిన నేతకు గౌరవం ఎక్కడ? గ్రామాల నుంచి జగన్‌కు ఘోర తిరస్కారం!

    ఒకప్పుడు “మామయ్య” అంటూ ప్రేమగా పిలిచిన మహిళలు, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పేరు వినగానే జాల్రాలు వేస్తున్నారు. ఇంట్లో ఒకరిలా కనిపించిన వ్యక్తి, ఆ ఇంటినే నాశనం చేసాడన్న భావన ఇప్పుడు గ్రామాల్లో బలంగా నెలకొంది. తన తల్లిని కోర్టుకు లాగిన వాడిని మన నాయకుడిగా ఎలా అంగీకరిస్తాం అని ఆడవాళ్లు గళమెత్తుతున్నారు. కుటుంబానికి గౌరవం లేని వాడికి ప్రజలకు ఏమాత్రం గౌరవం ఉంటుంది?

    గ్రామాల్లో ఇది ఏకవాక్యం: “మనం మోసపోయాం… ఇక మళ్లీ కాదు!” జగన్ వేసిన నాటకాలన్నీ బహిరంగమయ్యాయి. సంక్షేమం పేరుతో ఓట్లు గెలవడం మాత్రమే ఆయన లక్ష్యమని ప్రజలు ఎట్టకేలకు గుర్తించారు. అల్లరి మాటలతో ఆకర్షించిన రోజులే గడిచిపోయాయి. ఇప్పుడు ప్రజలు విషయాన్ని తలచుకొని మాడిపోతున్నారు.

    తల్లిని తక్కువ చేస్తే మనిషికి మానవత్వమే లేదని చెప్పే తెలుగు సంస్కృతిని తునాతునకలు చేసిన జగన్ పట్ల ఇప్పుడు గ్రామాల మన్ననే కాదు, మనస్సు కూడా పూర్తిగా తిరస్కరించింది. “ఎవడైనా గెలవాలి కానీ… ఇలాంటోడు కాదు” అన్న మాటలు ఆ వృద్ధుల నోటి నుంచి కూడా వినిపిస్తున్నాయి. ఒక్క కుటుంబం నడిపించలేని వాడిని రాష్ట్రం నడిపించడానికి ఎలా నమ్ముతాం?

    పార్టీ నాయకత్వంలో విభేదాలు, క్యాడర్‌కి గల వైముఖ్యాన్ని వేరే కోణంగా చూడాల్సిన అవసరం లేదు. అది జగన్‌ పట్ల ప్రజల్లోని అసహనం ప్రతిబింబమే. ఇప్పటికే 40 శాతం పైగా పార్టీ శ్రేణులు పార్టీని విడిచి వెళ్లిపోవడం యాదృచ్ఛికం కాదు. అది ప్రజలు తీర్పునిచ్చిన తర్వాత జరుగుతున్న సహజ పరిణామం.

    ఇప్పటికి గ్రామాల్లో ప్రజలు చెప్పేది ఒక్కటే—తల్లిని అగౌరవపరిచిన, చెల్లిని అపహాస్యం చేసిన వాడికి ఓటు వేయడమంటే… మా తల్లులను, చెల్లెల్లను అవమానపరచినట్టు అవుతుంది. ఇది రాజకీయ తిరస్కారం కాదు… ఇది నైతిక తిరుగుబాటు. జగన్ మళ్ళీ వచ్చిన రాస్తా కాదు… ఇదే చివరి దారి!

Comments are closed.