మళ్లీ పెళ్లి చేసుకున్న క్రిష్

దర్శకుడు క్రిష్ పెళ్లి చేసుకున్నాడు. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ ప్రీతి చల్లాను ఆయన వివాహం చేసుకున్నాడు. ఈరోజు వీళ్ల వివాహం సింపుల్ గా జరిగింది. ఇండస్ట్రీలో క్రిష్ కు అత్యంత సన్నిహితులు మాత్రమే…

దర్శకుడు క్రిష్ పెళ్లి చేసుకున్నాడు. హైదరాబాద్ కు చెందిన డాక్టర్ ప్రీతి చల్లాను ఆయన వివాహం చేసుకున్నాడు. ఈరోజు వీళ్ల వివాహం సింపుల్ గా జరిగింది. ఇండస్ట్రీలో క్రిష్ కు అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు.

క్రిష్ కు ఇది రెండో పెళ్లి. గతంలో కూడా ఓ డాక్టర్ ను ఆయన పెళ్లాడాడు. అయితే వాళ్ల వైవాహిక బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. అలా 2018 నుంచి సింగిల్ గా ఉంటున్న క్రిష్, ఇప్పుడు ప్రీతి రూపంలో మరో డాక్టర్ ను పెళ్లాడాడు. వృత్తిపరంగా ఈమె గైనకాలజిస్ట్.

క్రిష్-అనుష్క లవ్ లో ఉన్నారని.. వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఆమధ్య ప్రచారం జరిగింది. ఈ పుకారును అనుష్క ఖండించింది కూడా. ఈ ఊహాగానాలు చెలరేగిన కొన్ని రోజులకే క్రిష్ ఇలా ఓ ఇంటివాడయ్యాడు.

అనుష్క లీడ్ రోల్ లో ఘాటీ అనే సినిమాను తెరకెక్కించాడు క్రిష్. పవన్ తో చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా లేట్ అవ్వడంతో, ఆ ప్రాజెక్ట్ నుంచి కాస్త పక్కకు జరిగి ఘాటీని డైరక్ట్ చేశాడు. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలోకి వస్తుంది.

Click Here More Pics

9 Replies to “మళ్లీ పెళ్లి చేసుకున్న క్రిష్”

  1. మొదటి వివాహం తాలూకు ఆహ్వాన పత్రిక స్వదస్తూరి తో రాసి పంపినట్లు అప్పట్లో వార్తలు

Comments are closed.