మొదటి సినిమా ఉప్పెనతోనే బలమైన పాత్ర దక్కించుకుంది హీరోయిన్ కృతి షెట్టి. ఆ సినిమా సక్సెస్ తో అమ్మాయికి వరుసపెట్టి అవకాశాలొచ్చాయి. అయితే అలా ఒప్పుకున్న కథల్లో, ఓ సినిమా మాత్రం కృతిషెట్టికి, ఉప్పెన స్థాయి పేరు తీసుకొస్తుందని చెబుతున్నారు సినీజనాలు. అదే మాచర్ల నియోజకవర్గం.
నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో కేవలం హీరోయిన్ గా మాత్రమే కనిపించదట కృతి షెట్టి. కథను కీలక మలుపు తిప్పే ఎపిసోడ్ కోసమే కృతి శెట్టిని తీసుకున్నారట. దాదాపు 10 నిమిషాలు సాగే ఆ ఒక్క ఎపిసోడ్ తో కృతిషెట్టి పేరు ఇండస్ట్రీలో మరోసారి మారుమోగిపోతుందని చెబుతున్నారు.
పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కు, లవ్ ఎలిమెంట్ జోడించి తెరకెక్కిస్తున్నారు మాచర్ల నియోజకవర్గం సినిమాని. నితిన్ ఇందులో కలెక్టర్ గా కనిపించబోతున్నాడు. కృతిషెట్టి ఓ సాధారణ ఉద్యోగిగా కనిపించనుంది. వీళ్లిద్దరూ ఎందుకు కలిశారు? మాచర్ల రాజకీయాలకు వీళ్లకు ఏంటి సంబంధం అనేది సస్పెన్స్ పాయింట్. ఎడిటర్ ఎస్ఆర్ శేఖర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.
ప్రస్తుతం కృతి షెట్టి చేతిలో శ్యామ్ సింగరాయ్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, బంగార్రాజు, రామ్-లింగుసామి సినిమాలున్నాయి. ఈ సినిమాలన్నింటి కంటే మాచర్ల నియోజకవర్గంలోనే ఆమెకు బెస్ట్ క్యారెక్టర్ దొరికిందంటున్నారు.