నిజంగానే ప్రభాస్ వస్తున్నాడా..?

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప. డిసెంబర్ 17 రిలీజ్ పెట్టుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్ పీక్ స్టేజ్ లో నడుస్తోంది. అదే ఊపు కొనసాగిస్తూ త్వరలోనే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ చేయబోతున్నారు. ఇంకా…

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప. డిసెంబర్ 17 రిలీజ్ పెట్టుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్ పీక్ స్టేజ్ లో నడుస్తోంది. అదే ఊపు కొనసాగిస్తూ త్వరలోనే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ చేయబోతున్నారు. ఇంకా డేట్ ఫిక్స్ చేయని ఈ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడంటూ 2 రోజులుగా ప్రచారం సాగుతోంది. ఇంతకీ ప్రభాస్ నిజంగానే బన్నీ సినిమా ఫంక్షన్ కు వస్తాడా?

ఇందులో ఎలాంటి నిజం లేదు. కేవలం పుకారు మాత్రమే. పుష్ప సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ప్రభాస్ ప్రత్యేక అతిథిగా రావడం లేదని, స్వయంగా బన్నీ జనాల నుంచి క్లారిటీ వచ్చేసింది. ఇంతకీ ప్రభాస్ ఈ ఫంక్షన్ కు ఎందుకు రావడం లేదో తెలుసా?

రాధేశ్యామ్ అనే పాన్ ఇండియా సినిమాలో నటించాడు ప్రభాస్. ఈ సినిమా ప్రచారం మెల్లగా మొదలైంది. డిసెంబర్ రెండో వారం నుంచి ప్రమోషన్ ను పీక్ స్టేజ్ కు తీసుకెళ్లబోతున్నారు. అదే టైమ్ లో నార్త్ ఇండియాలో ప్రభాస్ తో ప్రమోషన్స్ ప్లాన్ చేశారట. దీంతో పుష్ప ఈవెంట్ కు రావడం కుదరదని ప్రభాస్ చెప్పినట్టు తెలుస్తోంది.

ఈమధ్య చాలా ఈవెంట్లకు హాజరవుతున్నాడు అల్లు అర్జున్. పుష్పక విమానం లాంటి చిన్న సినిమాతో పాటు, అఖండ లాంటి పెద్ద సినిమాల ఫంక్షన్లకు కూడా ప్రత్యేక అతిథిగా హాజరయ్యాడు. అలాంటి బన్నీకి ఇప్పుడు తన సినిమాకు ప్రత్యేక అతిథిని వెదకడం కష్టంగా మారినట్టుంది.