చాలా కాలం కిందటే ఆర్ఆర్ఆర్ అమ్మకాలు పూర్తయిపోయాయి. అయితే అలా అలా వెనక్కు జరిగి ఆఖరికి 2022 జనవరిలో విడుదలకు రంగం సిద్దం అయిపోయింది. కానీ సమస్య ఏమిటంటే ఇప్పుడు ఆంధ్రలో టికెట్ రేట్లు తగ్గిపోయాయి.
మరి ఆ రేట్లకు, ఈ అమ్మకాల రేట్లకు సింక్ అవుతుందా అన్నదే. చాలా మంది బయ్యర్లు ప్రస్తుతానికి ఏమీ మాట్లాడడం లేదు కానీ నెల్లూరు వరకు వచ్చేసరికి ట్రబుల స్టార్ట్ అయినట్లు బోగట్టా.
నెల్లూరు బయ్యర్ మాత్రం రేటు తగ్గించకపోతే కష్టమని నిర్మాత దానయ్యకు స్పష్టంగా చెప్పేసినట్లు తెలుస్తోంది. కానీ దానికి నిర్మాత దానయ్య ససేమిరా అనడమే కాకుండా, వదిలేస్తే వేరే బేరం సిద్దంగా వుందని చెప్పినట్లు తెలుస్తోంది.
దాంతో బయ్యర్ వదులుకోవడానికే సిద్దపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే చాలా అంటే చాలా క్రితమే కొనుగోలుచేసినందున, ఆ మేరకు వడ్డీ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా వుంటే ఆంధ్రలోని మరో ఏరియా బయ్యర్ కూడా రేటు తగ్గించకపోతే వెనుకడుకు వేసే ఆలోచనలో వువ్నారని వినిపిస్తోంది. అసలే రేట్లు తక్కువ పైగా కొత్త వైరస్ కలకలం కలిసి బయ్యర్లను భయపెడుతున్నట్లున్నాయి.