సిని హీరోల ఫ్యాన్స్ మధ్యలో వార్ అనేది కొత్తేమీ కాదు, కాకపోతే సోషల్ మీడియా పుణ్యమా అని అది తారా స్థాయికి చేరుతోంది. ప్రస్తుతం తెలుగు సూపర్ స్టార్ మహేశ్ బాబు, తమిళ స్టార్ దళపతి విజయ్ ఫ్యాన్స్ మధ్యలో ట్వీటర్ లో ట్రోల్స్ వార్ నడుస్తోంది.
ఒక వైపు మహేశ్ ఫ్యాన్స్ #NationalTrollMaterialVijay అంటూ ట్రోల్ చేస్తుంటే, విజయ్ ఫ్యాన్స్ #MBfansUnderVIJAYfansFoot అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక్కడ ఇద్దరు ఫ్యాన్స్ కూడా ట్రెండిగ్ కోసం ట్వీటర్ పోరాటం చేస్తు నిమిష నిమిషానికి ఒకరు ముందు ఒకరు వెనుకగా ట్రెండ్ చేస్తున్నారు.
ఇంతకు ముందు కూడా మెగా హీరో ఫ్యాన్స్ మధ్య, ఎన్టీఆర్- రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య కూడా ట్రోల్స్ నడిచాయి. కానీ ఇక్కడ ఇద్దరు వేరే వేరే బాష హీరోలు అయిన కూడా ఒకరికి ఒకరు ఫ్యాన్స్ ట్రోల్స్ చేసుకుంటూన్నారు. హీరో విజయ్ కు తమిళనాడులోనే కాకుండా తెలుగులో కూడా అభిమానులు ఉన్నారు. అలాగే హీరో మహేశ్ కూడా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. బహుశ అందుకోసమే ఇంత రచ్చ చేస్తున్నారు. కొన్ని మహేశ్ చేసిన తెలుగు సినిమాలు విజయ్ తమిళంలో డబ్బింగ్ చేసుకున్నారు. బహుశ ఇది కూడా ఒక కారణం అవ్వచ్చు.
ఏ హీరో అయిన పక్క హీరోలను చిన్న చూపు చూడరు. ఏ రాష్ట్ర నటులు అయిన గౌరవించుకోవడం మాన హీరోలందరికి బాగా తెలుసు. తమిళ సినిమా ప్రమెషన్స్ కు తెలుగు హీరోలు, అలాగే తెలుగు సినిమా హీరోల సినిమా ప్రమెషన్స్ కోసం తమిళ హీరోలు వస్తుంటారు, సపోర్టు చేస్తుంటారు. కానీ హీరోల మధ్య ఇగోలు లేకున్నా ఫ్యాన్స్ మధ్య మాత్రం ఆ పైత్యం కనపడుతోంది.
ఏ హీరో అభిమాని అయినా ఆ హీరోను అభిమానించడం తప్పు లేదు. కానీ వేరే హీరోలను టార్గెట్ చేయడం సినిమా పరిశ్రమకు మంచిది కాదు. కొంత మంది తెలుగు హీరోల అభిమానులు సినిమాలు చూడకుండానే సినిమాపై నెగిటివ్ ప్రచారం చేసి సినిమా ఆడకుండా చేస్తున్నా సందర్భాలు కూడా ఉన్నాయి. హీరోలు తమ అభిమానులను కట్టడి చేయకపోతే ఏదో రోజు వారికే నష్టం తగులుతుంది.