లేటు వయసులో ఘాటు ప్రేమలో పడిన ఐపీఎల్ ఫౌండర్ లలిత్ మోడీ మళ్ళీ వార్తలోకి నిలిచారు. రెండు నెలల క్రితం బాలీవుడ్ నటి, మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ తో డేటింగ్ ఉన్ననంటూ ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నా లలిత్ మోడీ జంట ఇప్పుడు విడిపోతున్నట్లు గాసిప్స్ లు వస్తున్నాయి.
లలిత్ మోడీ తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ప్రోఫైల్ ఫోటో మార్చి అందరిని అశ్చర్యపరిచారు. అంతకు ముందున్న లలిత్ మోడీ- సుస్మితా సేన్ తో కలిసి ఉన్న ఫోటోను తీసివేసి తాజాగా తన సింగిల్ ఫోటో మాత్రమే పెట్టుకున్నారు. అలాగే తన ఇన్ స్టా బయో లో కూడా సుస్మితా పేరు తోలగించడంతో అనుమానలు బలపడుతున్నాయి.
మాజీ విశ్వసుందరి తో డేటింగ్.. త్వరలోనే పెళ్లి అంటూ ప్రకటించిన లలిత్ మోడీ పెళ్లీపై సస్పెన్స్ నెలకొంది. లలిత్ మోడీకి ఇదివరకే పెళ్లీ అయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భారత్ లో తనపై ఉన్న కేసులకు బయపడి లలిత్ మోడీ లండన్‌లోనే తలదాచుకుంటున్నాడు.
లలిత్ మోడీతో డేటింగ్ ఉన్న 46 ఏళ్ల సుస్మితా సేన్ మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదు. పలువురితో డేటింగ్ చేసినా పెళ్లి చేసుకోలేదు, సుస్మితా ఇద్దరు అనాధ పిల్లలను దత్తత తీసుకోని పెంచుతోంది. అయితే ఈ ప్రేమ జంట పెళ్లి చేసుకుంటారా లేదా అనేది ఇప్పటికి అయితే సస్పెన్స్ నే.