భార్య‌పై మంచు విష్ణు హాట్ కామెంట్‌

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) అధ్య‌క్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు కాస్త రిలాక్ష్ కోరుకుంటున్నారు. దాదాపు రెండు నెల‌ల పాటు  ‘మా’ ఎన్నిక‌ల్లో టాలీవుడ్ త‌ల‌మున‌క‌లైంది. ఇక ఎన్నిక‌ల్లో నిలిచిన వాళ్ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పేదేముంది?…

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) అధ్య‌క్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు కాస్త రిలాక్ష్ కోరుకుంటున్నారు. దాదాపు రెండు నెల‌ల పాటు  ‘మా’ ఎన్నిక‌ల్లో టాలీవుడ్ త‌ల‌మున‌క‌లైంది. ఇక ఎన్నిక‌ల్లో నిలిచిన వాళ్ల గురించి ప్ర‌త్యేకంగా చెప్పేదేముంది? ఈ ఎన్నిక‌ల్లో మంచు విష్ణు, ప్ర‌కాశ్‌రాజ్ ప్యాన‌ళ్లు ఢీ అంటే ఢీ అని త‌ల‌ప‌డ్డాయి.  

‘మా’ ఎన్నిక‌లు మీడియాకు కావాల్సినంత మ‌సాలా ఇచ్చాయి. అలాగే జ‌నం కోరుకోకుండానే సినీ సెల‌బ్రిటీలు మ‌స్తు ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇచ్చారు. అందుకే ఈ ద‌ఫా ‘మా’ ఎన్నిక‌లు ఎంతో ప్ర‌త్యేక‌మ‌ని చెప్ప‌డం.

ఇదిలా వుండ‌గా ప్ర‌కాశ్‌రాజ్‌పై విజ‌యం సాధించి అధ్య‌క్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు త‌న భార్య‌, పిల్ల‌ల‌తో క‌లిసి స‌ర‌దాగా విహార యాత్ర‌కు వెళ్లారు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నారాయ‌న‌.

భార్యతో కలిసి విమానంలో వెళుతున్న వీడియోను ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్నారు. ఈ సందర్భంగా భార్య విరానిక గురించి ఆయ‌న కామెంట్ వైర‌ల్ అయ్యింది. ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో వీడియో షేర్‌ చేస్తూ.. కాస్తా బ్రేక్‌ తీసుకుంటున్నా అని చెప్పారు. 

అలాగే తన భార్య విరానికను చూపిస్తూ.. అవును తను హాట్‌..  ఎప్పుడూ  ఫోన్‌లో బిజీగా ఉంటుంది అంటూ మంచు విష్ణు చెప్ప‌డం నెటిజ‌న్ల‌ను ఆక‌ర్షించింది. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ చిన్నాన్న కూతురే విరానిక‌. ఈ రిలేష‌న్ కూడా ‘మా’ ఎన్నిక‌ల్లో ప్ర‌చార అస్త్ర‌మైన సంగ‌తి తెలిసిందే.