బాలయ్య షో స్పాన్సర్డ్ బై మ్యాన్షన్ హౌస్

సినిమా ఫ్యాన్స్ ఆసక్తి ఎదురు చూస్తున్న టాక్ షో 'అన్ స్టాపబుల్'. నందమూరి బాలయ్య తొలిసారి టాక్ షో చేస్తున్నారు. బాలయ్య టాక్ షో అంటే చాలు అందరికీ ఆసక్తే. ఆహా ఓటిటి సంస్థ…

సినిమా ఫ్యాన్స్ ఆసక్తి ఎదురు చూస్తున్న టాక్ షో 'అన్ స్టాపబుల్'. నందమూరి బాలయ్య తొలిసారి టాక్ షో చేస్తున్నారు. బాలయ్య టాక్ షో అంటే చాలు అందరికీ ఆసక్తే. ఆహా ఓటిటి సంస్థ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. 

ఇప్పటి వరకు ఓటిటి ప్లాట్ ఫారమ్ మీద కానీ టీవీ స్క్రీన్ మీద కానీ బాలయ్య కనిపించింది లేదు. నాగ్, చిరు, ఎన్టీఆర్, నాని ఇలా అందరూ ఏదో ఒకటి చేసారు. బాలయ్య కూడా ఇప్పుడు రంగంలోకి దిగారు.

బాలయ్య మాట్లాడడమే ఓ ఆసక్తి. పైగా టాక్ షో అంటే ఎలా వుంటుందో చూడాలి. నవంబర్ 4న ప్రారంభం అవుతున్న ఈ టాక్ షో ను మ్యాన్షన్ హవుస్ స్పాన్సర్ చేయడం విశేషం. 

బాలయ్య విషయంలో ఓ గ్యాసిప్ వుంది. ఆయనకు మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ అంటే చాలా ఇష్టమని, ఆయన విదేశాలకు వెళ్లినా కూడా ఆ బ్రాండ్ వుంటుందని గ్యాసిప్ వుంది. 

ఇప్పుడు అదే బ్రాండ్ బాలయ్య షో ను స్పాన్సర్ చేయడం అనేసరికి ఆసక్తికరంగా మారింది.