ఇక ఐకాన్ ను మరిచిపోవడమే

వకీల్ సాబ్ సినిమాతో టాప్ లీగ్ లోకి వెళ్లిపోయినంత హడావుడి జరిగిపోయింది దర్శకుడు వేణు శ్రీరామ్ విషయంలో. కానీ ఆ తరువాత ఇప్పటి వరకు సినిమా పడలేదు. అదేం చిత్రమో, వేణు శ్రీరామ్ కెరీర్…

వకీల్ సాబ్ సినిమాతో టాప్ లీగ్ లోకి వెళ్లిపోయినంత హడావుడి జరిగిపోయింది దర్శకుడు వేణు శ్రీరామ్ విషయంలో. కానీ ఆ తరువాత ఇప్పటి వరకు సినిమా పడలేదు. అదేం చిత్రమో, వేణు శ్రీరామ్ కెరీర్ మొత్తం ఇదే తరహా. పదేళ్లలో ఇప్పటికి తీసినవి ముచ్చటగా మూడు సినిమాలు. వకీల్ సాబ్ తరువాత మళ్లీ బ్రేక్. 

దిల్ రాజు కాంపౌండ్ లోనే ఐకాన్ సినిమాను బన్నీ తో తయారుచేయబోతున్నాడు అని వార్తలు వచ్చాయి. ఈ ప్రాజెక్టు గతంలో ఓసారి వినిపించి మళ్లీ ఆగిపోయింది. వకీల్ సాబ్ తరువాత మళ్లీ మరోసారి వినిపించింది. కానీ లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే మళ్లీ పక్కన పెట్టారని. 

బన్నీ తన తరువాత ప్రాజెక్టును తన స్వంత బ్యానర్ గీతా ఆర్ట్స్ మీద చేయబోతున్నాడు. సరైనోడు తరువాత మరోసారి బోయపాటితో కలిసి వర్క్ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని నిర్మాత అల్లు అరవింద్ నే ఇటీవల పబ్లిక్ డయాస్ మీద చెప్పేసారు. 

సరే, బోయపాటి సినిమా తరువాత అయినా ఐకాన్ సినిమా చేస్తాడేమో అంటే అదీ అనుమానంగానే వుంది. ఎందుకంటే కొరటాల శివతో గతంలో అనుకున్న ప్రాజెక్టు ఒకటి వుంది. అలాగే ఇంకా పలు కమిట్ మెంట్ లు వున్నాయి. అందువల్ల ఇక ఐకాన్ సినిమా బన్నీతో అన్నది మరిచిపోవడమే.