ఇలా ఫస్ట్ లుక్ రిలీజైందో లేదో అలా ట్రోలింగ్ మొదలైంది. ఇది డెకాయిట్ సంగతి. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ముందుగా శృతిహాసన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. హీరోహీరోయిన్లపై షూటింగ్ కూడా చేశారు. గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు.
అంతలోనే ఏమైందో ఏమో.. శృతిహాసన్ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ఆమె తప్పుకుంది అనే కంటే తప్పుకునేలా చేశారనడం కరెక్ట్. డెకాయిట్ మొత్తాన్ని తన కన్నుసన్నల్లో నడిపిస్తున్న అడివి శేష్.. శృతిహాసన్ నటనపై సంతృప్తి వ్యక్తం చేయలేదు. అందుకే ఆమెను తప్పించారనే ప్రచారం నడిచింది.
ఇప్పుడు ఆమె స్థానంలో మృణాల్ ఠాకూర్ ను తీసుకున్నారు. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. దీంతో శృతిహాసన్ అభిమానులు ప్రశ్నించడం మొదలుపెట్టారు.
నిన్నగాక మొన్నొచ్చిన మృణాల్ ఠాకూర్ కంటే శృతిహాసన్ ఎందులో తక్కువో చెప్పాలంటూ అడివి శేష్ ను ప్రశ్నిస్తున్నారు శృతిహాసన్ అభిమానులు. ఈ సందర్భంగా శృతిహాసన్ బెస్ట్ పెర్ఫార్మెన్సుల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
నిజానికి శృతిహాసన్, అడివి శేష్ కాంబినేషన్ చూడ్డానికి బాగాలేదని, అందుకే తప్పించారనే టాక్ కూడా అప్పట్లో బయటకొచ్చింది. మరి లుక్ టెస్ట్ చేసినప్పుడు ఆ విషయం తెలియలేదా అనేది శృతి ఫ్యాన్స్ ప్రశ్న.
ఏదేమైనప్పటికీ డెకాయిట్ లో హీరోయిన్ మార్పు జరిగిపోయింది. శృతిహాసన్ కూడా సైలెంట్ అయిపోయింది. షానీల్ డియో డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు అతడితో కలిసి అడివి శేష్ కథ-స్క్రీన్ ప్లే రాశాడు. అన్నపూర్ణ స్టుడియోస్ ప్రజెంట్ చేస్తున్న ఈ సినిమాకు సుప్రియ నిర్మాత.
Intaki yevaru Shruti Haasan fans
mrunal is 10 years younger than aunty shruti-haasan. shruti-haasan 40 years old lady
వాళ్ళ సినిమా, వాళ్ళ డబ్బులు, వాళ్ళు ఎవరిని పెట్టుకుంటే మనకెందుకు, అవసరం లేని పైత్యం..
వాళ్ళ-సినిమా, వాళ్ళ-డబ్బులు, వాళ్ళు-ఎవరిని-పెట్టుకుంటే-మనకెందుకు, అవసరం-లేని-పైత్యం..