నెటిజ‌న్ కోర‌కూడ‌ని కోరిక‌…తీర్చిన శ్రీ‌ముఖి

గ‌త కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో యాంక‌ర్‌గా శ్రీ‌ముఖిది ప్ర‌త్యేక శైలి. బిగ్‌బాస్ రియాల్టీ షో ఆమె పాపులారిటీని ఓ రేంజ్‌కు తీసుకెళ్లింద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. బిగ్‌బాస్ షోలో గ‌ట్టి పోటీనిచ్చి, చివ‌రికి ర‌న్న‌ర్‌గా నిలిచిన‌ప్ప‌టికీ, ప్రేక్ష‌కుల…

గ‌త కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో యాంక‌ర్‌గా శ్రీ‌ముఖిది ప్ర‌త్యేక శైలి. బిగ్‌బాస్ రియాల్టీ షో ఆమె పాపులారిటీని ఓ రేంజ్‌కు తీసుకెళ్లింద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. బిగ్‌బాస్ షోలో గ‌ట్టి పోటీనిచ్చి, చివ‌రికి ర‌న్న‌ర్‌గా నిలిచిన‌ప్ప‌టికీ, ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ను గెలుచుకుంది. 

హీరోయిన్ కావాల‌న్న ఆమె ల‌క్ష్యం ఇంకా నెర‌వేర‌లేదు. కానీ హీరోయిన్ల‌తో స‌మాన‌మైన గుర్తింపు, అభిమానుల‌ను శ్రీ‌ముఖి క‌లిగి ఉన్నారు. సోష‌ల్ మీడియాలో నిత్యం అభిమానుల‌తో ట‌చ్‌లో ఉంటూ, త‌న వ్య‌క్తిగ‌త‌, వృత్తిగ‌త విష‌యాల‌ను పంచుకుంటూ ఉంటారు. 

తాజాగా ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాటింగ్‌లో శ్రీ‌ముఖి ఓ వింత అనుభ‌వాన్ని ఎదుర్కొన్నారు. నెటిజ‌న్ ఓ తుంట‌రి ప్ర‌శ్న‌కు , శ్రీ‌ముఖి చాలా తెలివిగా స‌మాధానం ఇచ్చారు. ఆ తుంట‌రి కోర‌కూడ‌ని కోరిక తీర్చే సంద‌ర్భంలో శ్రీ‌ముఖి ప్ర‌ద‌ర్శించిన చతుర‌తపై సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి.  

ఇంత‌కూ ఆ నెటిజ‌న్ కోరింది ఏంటంటే… న‌గ్నంగా ఉన్న ఫొటో షేర్ చేయాల‌ని. ఆ క్ష‌ణంలో శ్రీ‌ముఖి షాక్‌కు గురై … ఆ వెంట‌నే తేరుకుని, స‌ద‌రు తుంట‌రికి షాక్ ఇచ్చార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.
 
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తెరకెక్కించిన ‘నగ్నం' సినిమా పోస్టర్‌ను ఆ నెటిజ‌న్‌కు షేర్ చేసి… శ్రీ‌ముఖి కంగు తినిపించారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో శ్రీ‌ముఖి పోస్ట్ చేశారు. 

శ్రీముఖి బ్రిలియెంట్ ఐడియాకు నెటిజన్లు ఫిదా అయ్యారు. వావ్‌…మీ మెద‌డు నిజంగా పాద‌ర‌సంలా ప‌నిచేస్తోంది,  సూపర్బ్‌ శ్రీముఖి..వాట్‌ ఎ రిప్లై …ఇలా శ్రీ‌ముఖిపై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురుస్తోంది. మొత్తానికి చెంప చెళ్లుమ‌నిపించేలా శ్రీ‌ముఖి ఆన్స‌ర్ ఇచ్చార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

ఓడిపోయే సరికి కుప్పం గుర్తుకు వచ్చిందా

చంద్రబాబు మెదడును విజయవాడ మ్యూజియంలో పెట్టాలి