తాజాగా ఫార్ములా రేసు కార్ ట్రైనింగ్ ప్రొగ్రామ్ లో లెవెల్-1 సర్టిఫికేట్ అందుకుంది హీరోయిన్ నివేత పెతురాజ్. రేసింగ్ ను చాలా సీరియస్ గా తీసుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన జీవితంలో కారు రేసులు, ట్రాక్స్, ఇష్టమైన కార్లకు సంబంధించి డీటెయిల్స్ బయటపెట్టింది.
“ఫస్ట్ టైమ్ రేస్ కారు చూసినప్పుడు భయమేసింది. అందులో కూర్చోడానికి, హెల్మెట్ పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను. కానీ ఒక్కసారి ట్రాక్ పైకొస్తే అంతా సెట్ అయిపోతుంది. ఆ మజానే వేరు.”
తన కార్ల కలెక్షన్ ను కూడా బయటపెట్టింది నివేత పెతురాజ్. తన దగ్గర చాలా కార్లు ఉన్నాయని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. అప్పట్లో దుబాయ్ లో డాడ్జ్ ఛాలెంజర్ కారు కొన్న రెండో మహిళగా నివేత రికార్డు సృష్టించింది.
“నా ఫస్ట్ కారు టయోటా యారిస్. ఏడాది కిందటే అమ్మేశాను. ఆ తర్వాత డాడ్జ్ ఛాలెంజర్ కొన్నాను. ఇప్పటికీ అది నా దగ్గరే ఉంది. ఆ తర్వాత బెలెనో కొన్నాను. ఇప్పుడు బీఏండబ్ల్యూ ఎక్స్4 కూడా ఉంది. కానీ నా ఫేవరెట్ మాత్రం ఛాలెంజర్.”
కార్లలో బీఏండబ్ల్యూ, రాల్స్ రాయిస్ కాకుండా మరో బ్రాండ్ కొనాల్సి వస్తే.. ఫోక్స్ వాగన్ పోలో జీటీఐ కారు కొంటానంటోంది నివేత. మరో 2 వారాల్లో లెవెల్ -2 కోసం ట్రాక్ పైకొస్తానంటున్న ఈ ముద్దుగుమ్మ.. తనకు ఆటోమేటిక్ కార్ల కంటే మాన్యువల్ కార్లు అంటేనే ఇష్టమని చెబుతోంది.
ఇక యాక్టింగ్ పై స్పందిస్తూ.. యాక్టింగ్ కెరీర్ ను తను ఎంచుకోలేదని, అదే తనను సెలక్ట్ చేసుకుందని చెప్పుకొచ్చింది. ఆమె నటించిన పాగల్ సినిమా త్వరలోనే థియేటర్లలోకి రానుంది. దీంతోపాటు విరాటపర్వంలో కూడా ఓ కీలక పాత్ర పోషించింది నివేత.