గుర్తింపు అన్నది అదృష్టం

తెలుగు ఇండస్ట్రీకి ఎంతోమంది నటులు కావాలని, హీరోలు కావాలని  వస్తుంటారు. కానీ అందులో కొందరు మాత్రమే గుర్తుండిపోతుంటారు. అలా తనకు కూడా తెలుగు ప్రేక్షకులు గుర్తింపు ఇచ్చారని, అది తన అదృష్టం అని అన్నారు…

తెలుగు ఇండస్ట్రీకి ఎంతోమంది నటులు కావాలని, హీరోలు కావాలని  వస్తుంటారు. కానీ అందులో కొందరు మాత్రమే గుర్తుండిపోతుంటారు. అలా తనకు కూడా తెలుగు ప్రేక్షకులు గుర్తింపు ఇచ్చారని, అది తన అదృష్టం అని అన్నారు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. 

రాజా గారు..రాణీగారు సినిమాతో జనాలకు పరిచయం అయిన కిరణ్ రెండో సినిమా ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమా త్వరలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో కిరణ్ విలేకరులతో మాట్లాడారు. 

తనకు తొలి సినిమా విజయాన్ని అందించి, సినిమా ఇండస్ట్రీలో ముందుకు వెళ్లే అవకాశం ఇచ్చిన ప్రేక్షకులకు కిరణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఎస్ ఆర్ కళ్యాణమండపం చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు కూడా కిరణ్ నే అందిస్తున్నారు. కానీ తనకు మాత్రం నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే లక్ష్యం అన్నారు.  

సాఫ్ట్‌వేర్ బ్యాక్ గ్రవుండ్ నుంచి సినిమాపై ప్యాషన్‌తో వచ్చానని ఆయన తెలిపారు. ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమా తరువాత ‘సెబాస్టియన్’ ‘సమ్మతమే’ సినిమా లు చేస్తున్నానని, అయిదోసినిమా కూడా స్టార్ట్ అవుతుందని కిరణ్ తెలిపారు. 

తనను ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రేక్షకులకు, దర్శక నిర్మాతలకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు కిరణ్ అబ్బవరం.