పెద్ద సినిమాలు అన్నీ పెండింగ్ నే?

పెద్ద పెద్ద సినిమాల షూట్ లు అన్నీ ప్రస్తుతం అలా ఎక్కడివి అక్కడ ఆగి వున్నాయి. కరోనా కారణంగా చిన్న, మీడియం సినిమాల షూట్ లు జరుగుతున్నా, పెద్ద సినిమాలు అన్నీ పెండింగ్ లోనే…

పెద్ద పెద్ద సినిమాల షూట్ లు అన్నీ ప్రస్తుతం అలా ఎక్కడివి అక్కడ ఆగి వున్నాయి. కరోనా కారణంగా చిన్న, మీడియం సినిమాల షూట్ లు జరుగుతున్నా, పెద్ద సినిమాలు అన్నీ పెండింగ్ లోనే వున్నాయి. మహేష్ బాబు సర్కారువారి పాట షూటింగ్ కు రావాల్సి వుంది. మార్చి నుంచి వస్తానని చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు షూట్ ఎప్పుడు వుంటుందో తెలియదు. ఏప్రిల్ నుంచి వుంటుందని టాక్. ఆ తరువాత సినిమాల సంగతి ఇప్పటికీ క్లారిటీ లేదు. ఎన్టీఆర్-కొరటాల సినిమా ముహుర్తం చేసుకుని మొదలు పెట్టాల్సి వుంది. కానీ కొరటాల భుజాల మీద నుంచి ఆచార్య సినిమా కిందకు దిగడం లేదు. 

చిరంజీవి మూడు సినిమాలు చేయాల్సి వుంది. ప్రస్తుతం ఆయనకు కూడా కరోనా రెండో సారి సోకింది. అందువల్ల కనీసం ఓ నెల వరకు ఆయన కూడా విశ్రాంతిలోనే వుంటారు. అందువల్ల ఆ సినిమాలు కూడా పెండింగ్ నే.

బన్నీ ప్రస్తుతం విశ్రాంతిలో వున్నారు. ఆయన పుష్ప 2 సినిమా స్టార్ట్ కావడానికి ఇంకా కాస్త సమయం పడుతుంది. రామ్ చరణ్-శంకర్ సినిమా కూడా ప్రస్తుతానికి షెడ్యూలు బ్రేక్ లో వుంది. 

ప్రభాస్ విదేశాల నుంచి నిన్ననే వెనక్కు వచ్చారు. మళ్లీ ఆయన సెట్ మీదకు ఎప్పుడు వెళ్తారో చూడాల్సి వుంది. రవితేజ మాత్రం చకచకా సినిమాలు ఆపకుండా చేస్తున్నారు. అఖండ తరువాత బాలయ్య మరే సినిమా ఇంకా ప్రారంభించలేదు. కరోనా పరిస్థితుల కారణంగా ఎవరినీ కలవడానికి ఆయన అంగీకరించడం లేదు.

మొత్తం మీద టాలీవుడ్ నడక ఆగిపోలేదు కానీ నెమ్మదిగా సాగుతోంది.