ప్రభాస్-ప్రశాంత్-ఉగ్రమ్ రీమేక్?

ఆగస్టు 11న గ్రేట్ ఆంధ్ర వెల్లడించింది  ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయిందని.  త్వరలో ప్రకటన వస్తుందని. ఆ ప్రకటన రానే వస్తోంది. మరో రెండో రోజుల్లో ప్రశాంత్…

ఆగస్టు 11న గ్రేట్ ఆంధ్ర వెల్లడించింది  ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ అయిందని.  త్వరలో ప్రకటన వస్తుందని. ఆ ప్రకటన రానే వస్తోంది. మరో రెండో రోజుల్లో ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబినేషన్ సినిమా ప్రకటన రాబోతోంది.

కన్నడంలో అయిదేళ్ల క్రితం వచ్చిన ఉగ్రమ్ సినిమానే పాన్ ఇండియా సినిమాగా రీమేక్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది.

కానీ ఒకసారి ఓ భాషలో వచ్చేసిన సినిమా మళ్లీ మరోసారి పాన్ ఇండియా సినిమా ఎలా అవుతుంది? లేదా ఉగ్రమ్ నే కాస్త మార్చి భారీ లెవెల్ లో తీస్తారా? ఈ వైనం అంతా తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే. 

సబ్జెక్ట్ ఏదయినా జనవరి నుంచి ఈ సినిమా సెట్ మీదకు వెళ్తుందని, ఆదిపురుష్ కన్నా ముందే ఈ సినిమా విడుదలవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. అది సమ్మర్ కు రెడీ అవుతుంది. మరి ప్రశాంత్ నీల్ సినిమా ఎప్పుడు విడుదల అయన్నది తెలియాల్సి వుంది.

అసెంబ్లీలో చంద్రబాబు రచ్చ