దసరా వీకెండ్ ముగిసింది. లిట్మస్ టెస్ట్ లాంటి సోమవారం కూడా గడిచింది. సినిమాల జాతకాలు తేలిపోయాయి. ఇంకా కొంతమంది మేకర్స్ తన సినిమాలపై ఆశలు పెట్టుకున్నారు. ఇంకొన్ని రోజుల్లో మౌత్ టాక్ ఇంకాస్త పెరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పుడు ఆ ఆశ కూడా లేకుండా చేస్తోంది తుపాను.
ఆంధ్రప్రదేశ్ ను మరోసారి తుపాను కలవరపెడుతోంది. నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో నిన్నట్నుంచే వానలు కురుస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో కూడా అదే పరిస్థితి. ఇక తిరుపతి చుట్టుపక్కల హై-ఎలర్ట్ ప్రకటించారు. ఈరోజు దక్షిణ కోస్తాలో, రేపు కర్నూలు-కడప ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.
ఏపీలోని దాదాపు అన్ని మెయిన్ సెంటర్లలో ఇప్పటికే ఆక్యుపెన్సీ తగ్గిపోయింది. విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి లాంటి సిటీల్లోని థియేటర్లలో జనం కనిపించడం లేదు. ‘విశ్వం’, ‘జనక అయితే గనక’ సినిమాలు ఇప్పటికే ఫ్లాప్ అయ్యాయి. ఈ భారీ వర్షాలతో ఉన్న కొద్దిపాటి ఆశ కూడా పోయింది.
దసరా సీజన్ లో బాగా నడిచిన దేవర, వేట్టయన్ సినిమాలపై కూడా వర్షాలు ప్రభావం చూపిస్తున్నాయి. వాటికి కూడా ఆక్యుపెన్సీ తగ్గింది. ఇక ఈ వర్షాల వల్ల అతిపెద్ద దెబ్బ సుధీర్ బాబు నటించిన ‘మా నాన్న సూపర్ హీరో’ సినిమాకే. దీనికి మంచి రివ్యూస్ వచ్చాయి కానీ ఓపెనింగ్స్ లేవు. పాజిటివ్ టాక్ తో జనం ఇప్పుడిప్పుడే పెరుగుతారని యూనిట్ ఆశపడుతోంది. ఏపీలో ఓ 2 రోజుల పాటు ఆశ వదులుకోవడం బెటర్.
Call boy jobs available 9989793850
🤣🤣🤣🤣😁😁😁😁😇😇😇😇😂😂😂😂🤐🤐🤐🤐🤐🤐🤐🤐🤐
vc available 9380537747
అందుకే డైరెక్ట్ ఓటిటిలోనే రిలీజ్ చేస్తే ఈ తుఫాను కలవరం ఉండదు