మరీ ఇంత కవరింగ్ అవసరమా?

సినిమా థియేటర్లలో ఫ్లాప్ అయింది. ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ తో తకరారు నడుస్తోంది. మధ్యలో సన్నివేశాలపై అభ్యంతరాలున్నాయి. వీటికి అదనంగా కోర్టు కేసు కూడా పడింది. Advertisement తంగలాన్ సినిమా ఓటీటీ రిలీజ్…

సినిమా థియేటర్లలో ఫ్లాప్ అయింది. ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ తో తకరారు నడుస్తోంది. మధ్యలో సన్నివేశాలపై అభ్యంతరాలున్నాయి. వీటికి అదనంగా కోర్టు కేసు కూడా పడింది.

తంగలాన్ సినిమా ఓటీటీ రిలీజ్ పై నడుస్తున్న చిక్కులివి. ఈ విషయాన్నీ అందరికీ తెలుసు. అలాంటప్పుడు నిర్మాత ఎలా రియాక్ట్ అవ్వాలి? ఉన్న విషయాన్ని ఒప్పుకోవాలి. కానీ తంగలాన్ మేకర్స్ మాత్రం ఓ రేంజ్ లో కవరింగ్ చేస్తున్నారు.

“తంగలాన్ చాలా స్పెషల్ సినిమా. దాన్ని ఏ రోజుపడితే ఆ రోజు విడుదల చేయకూడదు. అందుకే మంచి సందర్భం కోసం ఆగాం. దీపావళి కానుకగా నెట్ ఫ్లిక్స్ లో అది స్ట్రీమింగ్ అవుతుంది.” ఇదీ నిర్మాత చెబుతున్న వెర్షన్.

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఎప్పుడూ సినిమాను దాచిపెట్టుకోవు. మరీ ముఖ్యంగా ఫ్లాప్ అయిన తంగలాన్ లాంటి సినిమాల్ని అస్సలు ఉంచుకోవు. థియేటర్లలోకి వచ్చిన నెల రోజుల్లో ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ కు పెడదామా అని ఆలోచిస్తాయి. ఈ విషయాలు అందరికీ తెలిసినవే. కానీ తంగలాన్ మేకర్స్ మాత్రం బుకాయిస్తున్నారు.

ఈ కవరింగులు, బుకాయింపుల సంగతి పక్కనపెడితే.. తంగలాన్ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందనే అంశంపై ఆడియన్స్ కు క్లారిటీ వచ్చేసింది. నెగెటివ్ టాక్ కారణంగా థియేటర్లలో ఈ సినిమాను చాలామంది చూడలేదు. ఇంకా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీపావళికి చూడొచ్చు.

9 Replies to “మరీ ఇంత కవరింగ్ అవసరమా?”

  1. రేయ్ ఎర్రిపువ్వా.. ప్రొడ్యూసర్ నువ్వా అతనా? సినిమా సూపర్ డూపర్ హిట్ ఐతే ఫ్లాప్ అనడానికి నోరెలా వచ్చింది రా బాడ్కౌ. ❤డాలో కబుర్లు మింగకు.

Comments are closed.