రవితేజ-గోపీచంద్ మలినేని సినిమాకు హీరోయిన్ సమస్య వెన్నాడుతోంది. రష్మిక ను తీసుకోవాలని అనుకున్నారు. ఆ విషయం అధికారికంగా ప్రకటించకున్నా, ఎలాగోలా బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు రష్మక డేట్ లు సెట్ కావడం లేదు. సరే, తామే పరిచయం చేసిన కృతి శెట్టిని తీసుకోవాలనుకన్నారు. కానీ ఆమె డేట్ లు కూడా అటు ఇటు గా వున్నాయి. దీంతో ఆల్టర్ నేటివ్ ఏమిటి? అన్నది డిస్కషన్లు చేస్తున్నారు.
నిజానికి గత కొన్ని సినిమాల ట్రాక్ రికార్డు చూసుకుంటే ధమాకా తప్పితే మిగిలిన సినిమాలకు రవితేజకు సరైన హిరోయిన్ సెట్ కాలేదు. ఇంకా చెప్పాలంటే మైనస్ అయ్యారు కూడా, కానీ గోపీచంద్ మలినేని దర్శకుడు కావడం, మైత్రీ సంస్థ బ్యానర్ కావడంతో సరైన హీరోయిన్ వుండాల్సిందే అనే పట్టుదలతో వున్నారు.
కానీ అసలు ఇంతకూ డేట్ ల సమస్య ఎందుకు వస్తోంది? పైగా కృతి చేతిలో పెద్దగా సినిమాలు కూడా లేవు కదా? రష్మిక-రవితేజ కాంబినేషన్ అంటే క్రేజీగా వుండేది కదా అన్న ప్రశ్నలకు కేవలం సినిమా ప్లానింగ్ వల్లే అని సమాధానం వస్తోంది. ఈ సినిమాను నాన్ స్టాప్ గా షూటింగ్ చేసి ఆరు నెలల్లో విడుదల చేసి తీరాలన్నది నిర్మాత-దర్శకుల ఆలోచన. దానికి హీరో కూడా ఓకె అన్నారు. అందువల్ల ఈ డేట్ ల్లోనే హీరోయిన్ల డేట్ లు కావాలి. అక్కడ వస్తోంది రష్మికనా.. కృతినా అన్న సెలక్షన్ కు.
ఇక వీళ్ల డేట్ లు సెట్ కాకుండా కాస్త నోటెడ్ హీరోయిన్ ను ఎవరినైనా వెదకాలి. లేదా గోపీచంద్ మలినేని-రవితేజ కాంబినేషన్ కు కలిసి వచ్చిన శృతి హాసన్ ను అయినా ఎంచుకోవాలి. అక్కడ కూడా కంటిన్యూగా డేట్ లు దొరకాలి.