హీరో రవితేజ ను కలిసి, తమ నష్టాలు పూడ్చాలని అడగడానికి బయ్యర్లు రెడీ అయిపోతున్నారు. సోమ, మంగళ వారాల్లో ఏదో రోజు రవితేజ ను కలవాలని ప్లాన్ చేస్తున్నారు. రామారావు ఆన్ డ్యూటీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేరకు ఫెర్ ఫార్మ్ చేయలేదు. దర్శకుడు శరత్ మండవ చేసిన హడావుడి కూడా కొంత కారణమైంది. మొత్తం మీద బయ్యర్లు నష్టపోయారు. నిర్మాత సుదాకర్ చెరుకూరి తనకు చాతనయినంత సాయం చేసారు.
కానీ సినిమా నిర్మాణ భాగస్వామి రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్ యజమాని రవితేజ నుంచి కూడా బయ్యర్లు ఎంతొ కొంత ఆశిస్తున్నారు. ఈ సినిమాకు రవితేజ 18 కోట్లు తీసుకున్నారని, కాదు నిర్మాణంలో భాగస్వామి కూడా అని వార్తలు వచ్చాయి. అందుకే బయ్యర్లు రవితేజను కలవాలని అనుకుంటున్నారు.
సీడెడ్, ఆంధ్ర బయ్యర్లు ఈ మేరకు కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. సోమ,మంగళ వారాల్లో హైదరాబాద్ వెళ్లి రవితేజను కలిసి తమ నష్టాలను కొంతయినా పూడ్చాలని బయ్యర్లంతా ప్లాన్ చేస్తున్నారు.
కానీ వాస్తవం ఏమిటంటే ఈ సమర్పించు అనే బ్యానర్ల వైనం వెనుక చాలా రకాలు వుంటాయి. అన్ని సమర్పించులు కూడా నిర్మాణ భాగస్వాములు కాదు, హీరోలు తమ బ్యానర్లను తగిలించడం మామూలు అయింది. అలాగే రామారావు ఆన్ డ్యూటీ కి కూడా తగిలించి వుంటే బయ్యర్ల పర్యటన వృధానే కావచ్చు.