డైలమాలో చైతూ సినిమా విడుదల

ఓ మోస్తరు బడ్జెట్ తో వస్తున్న సినిమాలన్నీ ముందుగానే విడుదల తేదీలు ఫిక్స్ చేసుకుంటున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి, సమ్మర్ సీజన్లు సైతం దాటేసి.. ఆ వచ్చే ఏడాది, అంటే 2026 రిలీజ్ అంటూ…

ఓ మోస్తరు బడ్జెట్ తో వస్తున్న సినిమాలన్నీ ముందుగానే విడుదల తేదీలు ఫిక్స్ చేసుకుంటున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి, సమ్మర్ సీజన్లు సైతం దాటేసి.. ఆ వచ్చే ఏడాది, అంటే 2026 రిలీజ్ అంటూ చెప్పుకుంటున్న సినిమాలు కూడా ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో ఎంతో అడ్వాన్స్ గా ఉండాల్సిన తండేల్ టీమ్ మాత్రం డైలమాలో పడిపోయింది.

నాగచైతన్య కెరీర్ లోనే బిగ్ బడ్జెట్ మూవీగా వస్తోంది తండేల్ సినిమా. గీతాఆర్ట్స్-2 లాంటి పెద్ద బ్యానర్.. చైతూ-సాయిపల్లవి క్రేజీ కాంబినేషన్.. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో విడుదల చేయాలనుకున్నారు.

కట్ చేస్తే.. ఊహించని విధంగా డిసెంబర్ లో పోటీ పెరిగింది. ఈ నెలల్లోనే వస్తుందనుకున్న పుష్ప-2, ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన గేమ్ ఛేంజర్ డిసెంబర్ కు వచ్చి పడ్డాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల మధ్య తండేల్ ను క్రిస్మస్ నుంచి తప్పించాల్సి వచ్చింది.

నిజానికి ఇలా సినిమాల్ని షిఫ్ట్ చేయడం టాలీవుడ్ లో కొత్త కాదు. కాకపోతే వెంటనే మరో రిలీజ్ డేట్ లాక్ చేసుకోకపోవడం తప్పు. తండేల్ యూనిట్ ఇదే తప్పు చేసింది.

సినిమా వాయిదా పడి చాన్నాళ్లయినా ఇప్పటివరకు రిలీజ్ డేట్ పై నిర్ణయం తీసుకోలేదు. దీనికి కూడా ఓ కారణం ఉంది. తండేల్ సినిమాలో గ్రాఫిక్ పార్ట్ కాస్త ఎక్కువగా ఉందంట. అది ఓ కొలిక్కి వచ్చిన తర్వాత విడుదల తేదీపై డెసిషన్ తీసుకుంటారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే దసరా తర్వాత తండేల్ విడుదలపై ఓ క్లారిటీ వస్తుంది.

7 Replies to “డైలమాలో చైతూ సినిమా విడుదల”

Comments are closed.