ఆ రెండు పార్టీలకు ‘విలీనం’ ఒక కాలక్షేపం!

తెలంగాణలో కాంగ్రెస్ అండ్ బీజేపీకి వేరే పనేమీ లేనట్లుగా నాలుగు రోజులకొకసారి “విలీనం” కథ చెబుతుంటాయి. ఆ కథ ఏమిటో తెలిసిందే కదా. గులాబీ పార్టీ కాషాయం పార్టీలో విలీనం అవుతుందని రేవంత్ రెడ్డి,…

తెలంగాణలో కాంగ్రెస్ అండ్ బీజేపీకి వేరే పనేమీ లేనట్లుగా నాలుగు రోజులకొకసారి “విలీనం” కథ చెబుతుంటాయి. ఆ కథ ఏమిటో తెలిసిందే కదా. గులాబీ పార్టీ కాషాయం పార్టీలో విలీనం అవుతుందని రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు చెబుతుంటారు.

కాదు.. కాదు గులాబీ పార్టీ కాంగ్రెస్ లో విలీనం అవుతుందని బండి సంజయో, కిషన్ రెడ్డో, మరొకరో చెబుతుంటారు. తాజాగా రేవంత్ రెడ్డి ఢిల్లీలో కూడా ఇదే కథ వినిపించాడు. వెంటనే బండి సంజయ్ తన రికార్డ్ తాను వేశాడు. ఇదొక అంతులేని కథ. తెలంగాణ భాషలో చెప్పాలంటే ఒడవని కథ. ఇంగ్లిష్ లో చెప్పుకోవాలంటే నెవెర్ ఎండింగ్ స్టోరీ లేదా సీరియల్.

ఒకే కథను రెండు పార్టీలు ఎన్నాళ్ళు, ఎన్నేళ్లు చెబుతాయి? జనాలకు బోర్ కొట్టదా? బీజేపీలో గులాబీ పార్టీ విలీనమైతే కేసీఆర్ గవర్నర్ అవుతాడట. కేటీఆర్ కేంద్ర మంత్రి అవుతాడట. హరీష్ రావు అసెంబ్లీలో బీజీపీ పక్ష నాయకుడవుతాడట. ఇది రేవంత్ రెడ్డి వినిపించిన కథ.

గులాబీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయితే కేసీఆర్ కు ఏఐసీసీ పదవి ఇస్తారట. కేటీఆర్ కు పీసీసీ చీఫ్ పదవి ఇస్తారట. హరీష్ రావుకు మంత్రి పదవి ఇస్తారట. కవితకు ఎంపీ పదవి ఇస్తారట. ఇది బండి సంజయ్ వినిపించిన స్టోరీ.

గులాబీ పార్టీలో డిస్కషన్స్ అన్నీ రేవంత్ రెడ్డి, బండి సమక్షంలోనే జరుగుతున్నట్లుగా ఉంది. అలా కాకపోయినా వీరికి భవిష్యత్తు తెలుసుకునే దూరదృష్టి ఉన్నట్లుగా ఉంది. సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఎవరిదైనా జాతకం చెప్పినప్పుడు “రాసిపెట్టుకోండి” అంటాడు. అలాగే వీళ్ళు కూడా ఇది తప్పనిసరిగా జరుగుతుంది అన్నట్లుగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ కు నిజంగా పార్టీని నడపలేని పరిస్థితి వస్తే పార్టీని క్లోజ్ చేస్తాడు తప్ప ఏ పార్టీలోనూ విలీనం చేసి పదవులు తీసుకోడు.

అలా విలీనం చేస్తే మాత్రం ఆయనకు రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఒకవేళ కేసీఆర్ పార్టీని విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నాడని అనుకుందాం. అదే జరిగితే మాత్రం పార్టీలో తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్ కు ఈ మాత్రం గౌరవం కూడా ఉండదు.

8 Replies to “ఆ రెండు పార్టీలకు ‘విలీనం’ ఒక కాలక్షేపం!”

  1. పార్టీ లో తిరుగుబాటు వస్తుందా? పెద్ద జోక్, బీజేపీ లో మాటేమిటో కాని కాంగ్రెస్ లో విలీనం అంటే చెంగు చెంగు మని ఎగురుకుంటూ ఆనందం గా వెళ్తారు, రోగి కోరింది, డాక్టర్ చెప్పింది ఒకటే అన్నట్లు గా!

    1. 2019 లో కాంగ్రెస్ తో డైరెక్ట్ గా 10 జనపథ్ లో రాహుల్ గాంధీ తో కలిసిన చంద్రబాబు

      6 ఎంపీ లు 10 ఎంఎల్ఏ లు ఇస్తూనే చెంగు చెంగు మంటూ వెళ్లినట్లు వెళుతారు బ్రదర్

  2. ఫ్యాన్ పార్టీ నీ కాంగ్రెస్ కి అమ్మకానికి పెట్టిన సంగతి,

    రాహుల్ ప్యాలస్ పులకేశి నీ యెగ్గిరి తంతాను కానీ తన తల్లి నీ వ్యతిరేకించిన వాడిని మాత్రం కాంగ్రెస్ లో కలపడం తనకి ఇష్టం లేదు అని అన్నాడు అని, అందుకే మధ్యవర్తిగా వ్యవహరించిన కన్నడ శివకుమార్ కూడా ఆగిపోయాడు అన్నారు.

  3. తెలంగాణ పార్లిమెంట్ ఎన్నికలలో బీజేపీ కి ముక్కోడి సహకారం వలనే బీజేపీ కి అన్ని సీట్స్ వచ్చాయి అప్పటికే బీజేపీ , ముక్కోడు ఒకటే అని ప్రజలందరికి తెలిసిందే కదా …

Comments are closed.