క‌ర్నాట‌క సీఎంకు గ‌వ‌ర్న‌ర్ షాక్‌

క‌ర్నాట‌క గ‌వ‌ర్న‌ర్ సిద్ధ‌రామ‌య్య‌కు ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ థావ‌ర్ చంద్ గ‌హ్లోత్ షాక్ ఇచ్చారు. మైసూరు న‌గ‌రాభివృద్ధి ప్రాధికార (ముడా) స్కామ్‌లో క‌ర్నాట‌క సీఎంపై అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ కుంభ‌కోణానికి సంబంధించి విచార‌ణ‌కు…

క‌ర్నాట‌క గ‌వ‌ర్న‌ర్ సిద్ధ‌రామ‌య్య‌కు ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ థావ‌ర్ చంద్ గ‌హ్లోత్ షాక్ ఇచ్చారు. మైసూరు న‌గ‌రాభివృద్ధి ప్రాధికార (ముడా) స్కామ్‌లో క‌ర్నాట‌క సీఎంపై అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ కుంభ‌కోణానికి సంబంధించి విచార‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తులు మంజూరు చేయ‌డం క‌ర్నాట‌క రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం రేపుతోంది.

బీజేపీయేత‌ర ప్ర‌భుత్వాలు ఉన్న చోట గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ‌ను అడ్డు పెట్టుకుని కేంద్ర ప్ర‌భుత్వం రాజ‌కీయం చేస్తోందంటూ విప‌క్షాలు పెద్ద ఎత్తున ఆరోప‌ణ‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం కర్నాట‌క‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం వుంది. ఈ నేప‌థ్యంలో ముడా కుంభ‌కోణంలో సిద్ధ‌రామ‌య్య‌, ఆయ‌న భార్య‌తో పాటు మ‌రికొంద‌రిపై అవినీతి ఆరోప‌ణ‌లున్నాయి. వీరిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌కు సామాజిక కార్య‌క‌ర్త‌లు ఫిర్యాదు చేశారు.

ఈ వ్య‌వ‌హారంలో కొంత‌కాలంగా బీజేపీ తీవ్ర ఆరోప‌ణ‌లు చేస్తుండ‌డం, ఇప్పుడు గ‌వ‌ర్న‌ర్ విచార‌ణ‌కు అనుమ‌తులు ఇవ్వ‌డం వెనుక భారీ కుట్ర దాగి వుంద‌ని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇలాంటిదేదో జ‌రుగుతుంద‌ని క‌ర్నాట‌క సీఎం ముందే ఊహించారు. ఎందుకంటే అవినీతి ఆరోప‌ణ‌ల‌పై వివ‌ర‌ణ ఇవ్వాలంటూ గ‌త నెల‌లో సిద్ధ‌రామ‌య్య‌కు గ‌వ‌ర్న‌ర్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. విచార‌ణ‌కు ఆదేశించొద్ద‌ని కేబినెట్ తీర్మానించి గ‌వ‌ర్న‌ర్‌కు పంపింది. సీఎంకు ఇచ్చిన నోటీసుల్ని వెనక్కి తీసుకోవాల‌ని తీర్మానంలో కేబినెట్ కోరింది. అయిన‌ప్ప‌టికీ గ‌వ‌ర్న‌ర్ ఖాత‌రు చేయ‌లేదు.

గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తుల నేప‌థ్యంలో సిద్ధ‌రామ‌య్య కేబినెట్ ఇవాళ సాయంత్రం అత్య‌వ‌స‌రంగా స‌మావేశం కానుంది.

12 Replies to “క‌ర్నాట‌క సీఎంకు గ‌వ‌ర్న‌ర్ షాక్‌”

        1. Nikkar vesukoni, chai kasukune vadu mana nayakudu kakudadu Ani ekkadaka undi. ?

          Oh…Rahul Gandhi laga brainless Aina parledu Valle nayakulu kavalantava…?

          Ok ok

  1. mukhyamantri avineeti chEsinanta maatraana praasikyut chEsestaaraa ? idekkadi prajaswaamyaM ? pacchi niyaMtrutvam . mukhyamantri aviniti mida gavarnar icchina aadesalanu venakku tIsukuni prajaswaamyaanni kaapaadaali

Comments are closed.