సంక్రాంతి ముందు రేవంత్ రెడ్డి కఠిన నిర్ణయం!

టాలీవుడ్ మొత్తం హైదరాబాదులోనే ఉంది. సినిమా వాళ్ళ ఆస్తులు, వ్యాపారాలు ఇక్కడే ఉన్నాయి

ఈ ఏడాది తొందర్లో ముగిసిపోతుంది. జనవరిలో తెలుగువారికి ముఖ్యంగా సినిమా వాళ్లకు ముఖ్యమైన పండుగ, ఇష్టమైన పండుగ సంక్రాంతి వస్తుంది. ఈ పండుగ సందర్భంగా టాలీవుడ్ సినిమాలు రిలీజ్ అవుతాయి. వాటిల్లో పెద్ద హీరోల సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు ఉంటాయి.

ఈ సంక్రాంతికి కూడా ఉన్నాయి. ఇలాంటి సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఏమిటా నిర్ణయం? ఇకనుంచి తెలంగాణలో కొత్త సినిమాలకు బెనిఫిట్ షోలు, టిక్కెట్ల రేట్లు పెంచుకోవడం ఉండదని చాలా స్పష్టంగా చెప్పాడు. తాను సీఎంగా ఉన్నంత కాలం ఇది అమలు జరుగుతుందని చెప్పాడు.

దీంతో టాలీవుడ్ గుండెల్లో బండ పడింది. వారిలో తీవ్ర ఆందోళన నెలకొంది. సీఎం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం సంధ్య థియేటర్ దుర్ఘటన. ఈ చరిత్ర ఏమిటో అందరికీ తెలుసు. భారీ పెట్టుబడులతో పాన్ ఇండియా సినిమాలు తీస్తున్న నిర్మాతలకు పెట్టుబడులు తిరిగి రావాలంటే బెనిఫిట్ షోలు, టిక్కెట్ల రేట్లు పెంచుకోవడమే మార్గం.

ఈ కాలంలో ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఇందుకు ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయి. కానీ సంధ్య థియేటర్ దుర్ఘటనతో సీఎం రేవంత్ రెడ్డిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అల్లు అర్జున్ ను, సినీ పరిశ్రమను కడిగిపారేశాడు. పనిలో పనిగా కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన వైఖరి చూస్తుంటే ఆ నిర్ణయం నుంచి వెనక్కు తగ్గేలా లేడు.

సంక్రాంతి దగ్గర పడుతుండటంతో టాలీవుడ్ లో ఆందోళన మొదలైంది. అసలు సంక్రాంతికి నాలుగు రోజుల ముందే పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ విడుదల అవుతోంది. అది వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించిన సినిమా. దానికి ఎన్. శంకర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

రేవంత్ రెడ్డి నిర్ణయంతో దాని మీదనే మొదటి దెబ్బ పడుతుంది. జగన్ ఏపీ సీఎంగా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యే వస్తే మెగాస్టార్ చిరంజీవి సహా పెద్ద పెద్ద హీరోలు, దర్శకులు వెళ్లి జగన్ దగ్గర లాబీయింగ్ చేస్తే సమస్య పరిష్కారం అయింది. ఇప్పుడు అల్లు అర్జున్ కారణంగా తెలంగాణలోనూ సమస్య వచ్చింది. ఏపీలో వచ్చిన సమస్య నేపథ్యం వేరు. తెలంగాణలో వచ్చిన సమస్య నేపథ్యం వేరు.

కానీ టాలీవుడ్ మొత్తం హైదరాబాదులోనే ఉంది. సినిమా వాళ్ళ ఆస్తులు, వ్యాపారాలు ఇక్కడే ఉన్నాయి. దీంతో రేవంత్ రెడ్డిని ప్రసన్నం చేసుకోవడం ముఖ్యం. మళ్ళీ చిరంజీవి నాయకత్వంలోనే సీఎంతో చర్చలు జరపాలని అనుకుంటున్నారట. ప్రభుత్వం ఎలాంటి షరతులు పెట్టినా అంగీకరించాలని అనుకుంటున్నారట.

‘గేమ్ చేంజర్’ చిత్రం తో పాటు, వచ్చే ఏడాది అనేక పాన్ ఇండియన్ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ కూడా భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రమే. ప్రభాస్ నటించిన రాజా సాబ్ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. మళ్ళీ అదే ఏడాది పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీ ‘ఓజీ’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఈ చిత్రానికి కూడా కచ్చితంగా టికెట్ రేట్స్, హైక్స్ కావాల్సిందే. టాలీవుడ్ స్థాయి ని మరో లెవల్ కి తీసుకెళ్లే సినిమాలన్నీ కూడా వచ్చే ఏడాది విడుదల కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ మార్కెట్ మన సినీ పరిశ్రమకి చాలా కీలకం. మరి సినీ పరిశ్రమ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.

23 Replies to “సంక్రాంతి ముందు రేవంత్ రెడ్డి కఠిన నిర్ణయం!”

  1. okappudu telugu cinema just in two states. ippudu releasing in multiple languages. so these stupid producers should stop grabbing/mint money from telugu guys.

  2. సిఎం కంటే తానే గొప్ప వాడిని అని ఎవడో శిల్పా గాడు, అల్లు అర్జున్ కి చెప్పి వుంటారు.

    దానితో తాను నిజంగానే పుష్ప నీ అని, తెలంగాణ సిఎం నీ మారిస్తాని అని ఫీల్ అయ్యాడు లాగ వింది.

  3. పూష్పా సినిమా లో సిఎం నే మార్చేశాడు అల్లు అర్జున్.

    కనుక జాగ్రత్త రేవంత్ గారు, సోనియా కి చెప్పి మీ సిఎం సీట్ మారుస్తారు ఏమో అని పుష్ప ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

    అదే ఫీలింగ్ లో వున్నారు పుష్ప , పుష్ప కి వెనక వుంది ఎగ దోస్తున్న జగన్ కూడా.

    1. Pushpa already fixed date for CM change. On Jan 10th Telengana will have new CM. He is bringing 2 lakh crore worth of drugs using drones from Pakistan to fund this operation.

  4. ఈ దమ్ము ap ప్రభుత్వానికి ఉండాలి…..కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే కూటమి విచ్చిన్నమవ్వుద్దనే భయం..ప్రజలు ఎలాంటి ఇక్కట్లు పడ్డ వీళ్ళకి అవసరం లేదు..తోడు ఉన్న.నాలుగు గొట్టాలని పిలిచి వాళ్ళతో బాకా ఉదించేసి ప్రజాలకింగంతలు కట్టేసి సంగీతం వినిపిస్తారు..

  5. ఈ ఆలోచన ap ప్రభుత్వానికి ఉండాలి…..కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే కూటమి విచ్చిన్నమవ్వుద్దనే భయం..ప్రజలు ఎలాంటి ఇక్కట్లు పడ్డ వీళ్ళకి అవసరం లేదు..తోడు ఉన్న.నాలుగు మెడియాలని పిలిచి వాళ్ళతో ఉదించేసి ప్రజాలకి గంతలు కట్టేసి సంగీతం వినిపిస్తారు..

  6. రేవంత్టి రెడ్డి టికెట్ రేట్స్ పెంచమని చెప్పినందుకు and బెనిఫిట్ షోస్ రద్దు చేసినందుకు బున్నీ గాడు హ్యాపీ.. ఎందుకంటే ఇక సినిమా హిట్ అయినా ఎవడికీ ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావు.. బున్నీ గాడి రికార్డ్స్ forever గా నిలిచే ఉంటాయ్

  7. ఎక్కువ బడ్జెట్ తో తీశాం నష్టం రావొద్దు అని టిక్కెట్లు rates పెంచారు.ఇప్పుడు వారు భారీ లాభాలను పొందారు, వారు అవసరమైన వారికి సగం దానం చేస్తారా ???

  8. రేవంత్ అలిగి బుంగమూతి పెట్టాడు అంతే. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ వెళ్ళి బతిమాలితే అలుక మానతాడు.

  9. చెత్త ఆర్టికల్. అవినీతిని నిరోధించే చర్యలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి తీరును తప్పు పట్టేలా, అవినీతిపరులకు కొమ్ము కాసేలా నీచమైన రాతలు రాయడం అన్యాయం.

  10. Nagarjuna defamation case vesinappudu gumpu mestri gaadu decide ayyadu. Sandhya theater scene ni vaadukunnadu anthey. Lekapote issue jarigina Next day nunche tickets rates tagginchagaladu special GO ichi. Kaani cheyyaledu. Savala meeda pelaalu erukune lanjakoduku gumpu gaadu

Comments are closed.