6 కత్తి పోట్లు.. 2 లోతైన గాయాలు

సైఫ్ అలీఖాన్ ను అగంతకుడు 6 సార్లు కత్తితో పొడిచాడని వైద్యులు ప్రకటించారు. వీటిలో 2 గాయాలు లోతుగా ఉన్నాయని పేర్కొన్నారు.

అర్థరాత్రి సైఫ్ అలీఖాన్ పై హత్యాయత్నం జరిగింది. అగంతకుడు అతడిపై కత్తితో దాడి చేశాడు. వెంటనే సైఫ్ ను లీలావతి హాస్పిటల్ లో జాయిన్ చేశారు. సైఫ్ ఆరోగ్య పరిస్థితిపై హాస్పిటల్ వర్గాలు స్పందించాయి.

సైఫ్ అలీఖాన్ ను అగంతకుడు 6 సార్లు కత్తితో పొడిచాడని వైద్యులు ప్రకటించారు. వీటిలో 2 గాయాలు లోతుగా ఉన్నాయని పేర్కొన్నారు. వీటిలో ఒక గాయం మెడపైన, మరోగాయం ఛాతికి కింద ఉన్నాయి. తీవ్రమైన కత్తిపోట్లు ఇవే.

న్యూరో సర్జన్ డాక్టర్ డింగే, కాస్మొటిక్ సర్జన్ డాక్టర్ జైన్.. సైఫ్ కు సర్జరీ చేసిన టీమ్ లో ఉన్నారు. సైఫ్ కు ప్రాణాపాయం తప్పినట్టు వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నాడు. భార్య కరీనా కపూర్, పిల్లలతో సహా హాస్పిటల్ లోనే ఉంది.

మరోవైపు ఈ కేసును బాంద్రా పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విచారణను వేగవంతం చేశారు. సైఫ్ ఇంటి చుట్టూ ఉన్న సీసీటీవీ ఫూటేజ్ లు పరిశీలించారు. రాత్రి 12.30 గంటల తర్వాత సైఫ్ ఇంట్లోకి ఎవ్వరూ ప్రవేశించలేదనే విషయాన్ని గుర్తించారు. అంటే, దుండగుడు ప్లాన్ ప్రకారం, ముందే ఇంట్లోకి చొరబడినట్టు పోలీసులు గ్రహించారు. అతడు దొంగతనం కోసం వచ్చాడా లేక సైఫ్ ను హత్య చేసేందుకు వచ్చాడా అనేది తేలాల్సి ఉంది.

మరోవైపు సైఫ్ పై దాడి ఘటన రాజకీయ రంగు పులుముకుంది. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి.

6 Replies to “6 కత్తి పోట్లు.. 2 లోతైన గాయాలు”

  1. ఇది మామూలుగా జరిగిన దాడి అయ్యుండదు. సెక్యూరిటీ, కుక్కలు, కెమెరాలు ఉన్నా కానీ జరిగింది అంటే.. పెద్ద స్థాయి కుట్ర అయ్యుండొచ్చు.

  2. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  3. దేశంలో సాయాబుల పెద్దలను చంపే ప్రయత్నం చెస్తూంది ఈ బిజేపి ప్రభుత్వం. హత్య ప్రయత్నాలు చేసి భయబ్రాంతులకు గురిచేయాలని చూస్తూంది ఈ బిజేపి వలన ఎవ్వరికీ ప్రయొజనం లేదు

Comments are closed.