ప్రమాదంలో టాలీవుడ్.. పరిష్కారం లేదా?

అసలు పైరసీని అరికట్టడం టాలీవుడ్ వల్ల అవుతుందా..? ఏ టెక్నాలజీని ఉపయోగించి పైరసీని కొత్త పుంతలు తొక్కిస్తున్నారో, అదే టెక్నాలజీ సాయంతో పైరసీని అడ్డుకోలేరా?

టాలీవుడ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతారు. దాన్నొక బిగ్ ఛాలెంజ్ గా ఫీల్ అయ్యారు దిల్ రాజు. ఇక ఆంధ్రప్రదేశ్ లో టాలీవుడ్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి, స్థానిక యువతకు టాలీవుడ్ లో అవకాశాలు కల్పించేలా ట్రయినింగ్ ఇవ్వాలని పవన్ కల్యాణ్ పిలుపునిస్తారు. దాన్నొక గురుతర బాధ్యతగా ఫీలయ్యారు ఇండస్ట్రీ పెద్దలు. మరోవైపు టాలీవుడ్ అభివృద్ధి కోసం, ఇండస్ట్రీని పాన్ ఇండియా స్థాయికి తీసుకెళ్లడం కోసం టికెట్ రేట్లు పెంచుతుంది ప్రభుత్వం. నిజంగా టాలీవుడ్ అవసరాలు ఇవేనా.. ప్రభుత్వం చేయాల్సింది ఇదేనా.. ఇంతకుమించి టాలీవుడ్ కు పెద్ద సమస్యల్లేవా..?

కచ్చితంగా ఉంది.. చాలా పెద్ద సమస్య ఉంది. ఏళ్లుగా పట్టి పీడిస్తోంది. కానీ దాని గురించి ఎవ్వరూ బయటకు మాట్లాడారు. వ్యవస్థీకృతంగా ఓ తీర్మానం చేయరు. కలిసికట్టుగా పరిష్కారం చేద్దామంటూ ఎవ్వరూ ముందుకురారు. అదే పైరసీ భూతం.

పైరసీ కోసం ఏఐ టెక్నాలజీ..

ఇదేదో ఇప్పుడే కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. వీసీడీ క్యాసెట్లు, డీవీడీ డ్రైవ్ ల నుంచి ఉన్నదే. కాకపోతే ఇప్పుడు కొత్త రూపు తీసుకుంది. టెక్నాలజీని టాలీవుడ్ ఎంతలా ఒడిసిపట్టుకుందో చెప్పలేం కానీ, పైరసీ మాత్రం ఈ విషయంలో కొత్తపుంతలు తొక్కుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్-ఏఐ ఉపయోగించి మరీ సినిమాల్ని పైరసీ చేస్తోంది. ఒకప్పుడు సినిమా రిలీజైన వారం రోజుల తర్వాత పైరసీ కనిపించేది. కొన్నాళ్లకు రిలీజైన మొదటి వారాంతం పైరసీ ఉండేది. కానీ ఇప్పుడు మొదటి ఆట పడే సమయానికే పైరసీ కోరలుచాస్తోంది. రెండో ఆటకు పైరసీ ప్రింట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమౌతోంది. మొన్నటికిమొన్న పుష్ప-2 బెనిఫిట్ షో చూసి, ఇంటికొచ్చేసరికి సోషల్ మీడియాలో సినిమా రెడీగా ఉంది. అంత ఫాస్ట్ గా ఉంది పైరసీ. నిన్నటికినిన్న గేమ్ ఛేంజర్ పరిస్థితి కూడా ఇదే.

ఇదేదో ఆషామాషీ ప్రింట్ కాదు. హెడ్ డీ క్వాలిటీ ప్రింట్స్ అందిస్తున్నారు దొంగలు. దీని కోసం వాళ్లు అధునాతన టెక్నాలజీని వాడుతున్నారు. నాయిస్ కాన్సలేషన్, విజువల్ ఎన్ హాన్స్ మెంట్, డాల్బీ సెట్టింగ్స్ లాంటి సాంకేతిక పరిజ్ఞానాలు వాడి మరీ హై-క్వాలిటీ ప్రింట్స్ ను అందిస్తున్నారు.

ఫ్యాన్ వార్స్ తో పైరసీ..

మొన్నటివరకు పైరసీ అనేది ఓ బ్లాక్ మార్కెట్ గా, బ్లాక్ మెయిలింగ్ సాధనంగా ఉండేది. అడిగినంత ఇవ్వకపోతే సినిమాను పైరసీ చేస్తాం అంటూ హెచ్చరించేవాళ్లు. పైకి చెప్పకపోయినా చాలామంది నిర్మాతలు, తమ సినిమా తొలివారం పైరసీ కాకుండా ఆపేందుకు, తెరవెనక సమర్పించుకున్నోళ్లే. ఇక్కడ పేర్లు అనవసరం. మంచి హైప్ ఉన్న సినిమా తీస్తే, అందరితో పాటు ఇలాంటి పైరసీ సైట్లకు కూడా పేమెంట్లు చేసే దౌర్భాగ్య పరిస్థితి ఉంది.

ఇది చాలదన్నట్టు ఇప్పుడు ఇందులోకి కూడా ఫ్యాన్ వార్స్ ఎంటరయ్యాయి. తమ హీరో సినిమా కంటే, మరో హీరో సినిమా ఎక్కువ ఆడేస్తుందేమో.. ఎక్కువ వసూళ్లు కొల్లగొడుతుందేమో.. ఎక్కువ రికార్డులు సృష్టిస్తుందేమో.. ఇలా కొంతమంది పిచ్చి అభిమానుల భయం కూడా ఇప్పుడు పైరసీకి కారణంగా మారుతోంది. ఒక హీరో సినిమాను దెబ్బకొట్టేందుకు, మరో హీరో అభిమానులు పైరసీని ప్రోత్సహించడం ఇప్పుడు కామన్ అయిపోయింది.

టాలీవుడ్ కు ఇది ప్రాధాన్యం కాదా..

ఓవైపు ఇంత జరుగుతుంటే, టాలీవుడ్ కు మాత్రం అది పట్టదు. పైరసీని నియంత్రించేందుకు ఏం చేద్దామంటూ చర్చలు జరపరు. టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం ముందు క్యూ కట్టే నిర్మాతలు, పైరసీని అరికట్టమని మాత్రం ప్రభుత్వాన్ని అడగరు. తమ సినిమా కాదుకదా అనే అలసత్వమే పైరసీ విచ్చలవిడిగా విజృంభించడానికి ప్రధాన కారణం. ఆ క్షణానికి పోలీసులకు ఫిర్యాదు చేయడం లాంటి పైపై చర్యలు తప్పితే, టాలీవుడ్ అంతా కలిసి సమష్టిగా పైరసీపై వ్యవస్థాగతంగా ఏదైనా చేద్దామనే ఆలోచన లేదు.

అసలు పైరసీని అరికట్టడం టాలీవుడ్ వల్ల అవుతుందా..? ఏ టెక్నాలజీని ఉపయోగించి పైరసీని కొత్త పుంతలు తొక్కిస్తున్నారో, అదే టెక్నాలజీ సాయంతో పైరసీని అడ్డుకోలేరా? ఇలాంటివి చర్చించాలంటే ముందుగా ఓ సమావేశమంటూ ఒకటి జరగాలి కదా!

10 Replies to “ప్రమాదంలో టాలీవుడ్.. పరిష్కారం లేదా?”

  1. ippudu antha scene ledu…. ye movie ayinaa one month lo OTT lo vastundi. ippudu piracy ni evvadu peddaga care cheyadam ledu . okappudu Tollywood people baaga hadavidi chesevaallu , theatre lo chudandi chudandi ani .. ippudu evvadu dekadam ledu.

  2. వాళ్ళ సంగతి తరువాత తమ సైట్ లో దొర్లే స్పెల్లింగ్ మిస్టేక్స్ ని కరెక్ట్ చేసుకోండి అదే ఆ AI వాడి . .

  3. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  4. చిత్రనిర్మాతలు మరియు అగ్ర హీరోలు నిజమైన సినిమా అభిమానులను మరియు సినిమాను తీవ్రంగా ఇష్టపడే వారిని లక్ష్యంగా చేసుకుని మొదటి రోజు/వారంలో డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తారు. ఇది వారికి మంచిది, కాబట్టి జాలిపడాల్సిన అవసరం లేదు

Comments are closed.