సమంత..కుక్క పిల్ల సందేశం

సమంత చాలా తెలివైన హీరోయిన్. అందులో అణుమాత్రం సందేహం లేదు. విషయాన్ని దాటవేయడంలోనూ, విషయాన్ని మరింత జటిలంగా మార్చడంలోనూ టాలెంట్ బాగానే సంపాదించినట్లు కనిపిస్తుంది.  Advertisement అక్కినేని అనే ఇంటి పేరును తన పేరు…

సమంత చాలా తెలివైన హీరోయిన్. అందులో అణుమాత్రం సందేహం లేదు. విషయాన్ని దాటవేయడంలోనూ, విషయాన్ని మరింత జటిలంగా మార్చడంలోనూ టాలెంట్ బాగానే సంపాదించినట్లు కనిపిస్తుంది. 

అక్కినేని అనే ఇంటి పేరును తన పేరు లోంచి తీసేసిన దగ్గర నుంచి తెగ గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి, సమంత కూడా దానికి తగినట్లే సమాధానం ఇచ్చింది మొన్నటికి మొన్న ఓ ఇంటర్వ్యూలో. 

లేటెస్ట్ గా సమంత ఓ కుక్క పిల్లతో కలిసి దిగిన ఫొటో వైరల్ అవుతోంది. ఇది సమంత తన ఇన్ స్టా స్టేటస్ లో పెట్టిన పిక్. కుక్క పిల్లలు అంటే ఎంతో ఇష్టం వున్న సమంత అలా ఫొటో దిగడం వింత కాదు. కానీ దాని కింద క్యాప్షన్ నే కాస్త ఆలోచించేలా వుంది. 'స్టే విత్ మి ఫరెవర్' అన్నదే ఆ క్యాప్షన్. 

ఇంతకీ సమంత స్టే విత్ మీ ఫరెవర్ అని ఎవరికి చెబుతున్నట్లు? ఆ కుక్క పిల్లకేనా? లేక ఆ సందేశం మరెవరికైనా అన్యాపదేశంగా ఇస్తున్నట్లా? లేక ఎవరైనా తనతో ఆ కుక్కపిల్లలా ఎప్పటికీ వుండాలనా? ఏమైనా సరే, సమంత టాపిక్ టాలీవుడ్ లో కొన్నాళ్లు అలా హాట్ డిస్కషన్లకో, గ్యాసిప్ లకో దారి తీస్తూనే వుంటుందేమో?