శేష్ రేంజ్ పెరుగుతోంది

ఒక్క ఫ్లాప్ లేదు..వరుస హిట్ లు. పైగా ఓపెనింగ్స్ కోసం, సినిమా ప్రచారం కోసం కిందా మీదా అయిపోతాడు. విపరీతంగా కష్టపడతాడు. సినిమా విడుదలైన తరువాత కూడా వదిలిపెట్టడు. ఇవన్నీ కలిసి అడవిశేష్ రెమ్యూనిరేషన్…

ఒక్క ఫ్లాప్ లేదు..వరుస హిట్ లు. పైగా ఓపెనింగ్స్ కోసం, సినిమా ప్రచారం కోసం కిందా మీదా అయిపోతాడు. విపరీతంగా కష్టపడతాడు. సినిమా విడుదలైన తరువాత కూడా వదిలిపెట్టడు. ఇవన్నీ కలిసి అడవిశేష్ రెమ్యూనిరేషన్ ను కాస్త గట్టిగానే పెంచినట్లు కనిపిస్తోంది. 

రెండేళ్ల క్రితం నాలుగు కోట్లు వున్న అడవి శేష్ రెమ్యూనిరేషన్ ఇప్పుడు డబుల్ అయిందని తెలుస్తోంది. మేజర్, హిట్ 2 సినిమాల తరువాత ఎనిమిది కోట్లు కోట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ లెక్కలు అన్నీ తనకు తెలియవని, తనకు ఏ రెమ్యూనిరేషన్ బెటర్ అన్నది తన మేనేజర్ మహేంద్రనే చూసుకుంటాడని అంటాడు శేష్.

సంజయ్ దత్ 10 కోట్లు

కేజిఎఫ్ 2 తరువాత బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మీద పడింది మన వాళ్ల దృష్టి. సరైన, బలమైన పాత్ర వుంటే సంజయ్ పేరు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్-మారుతి సినిమాలో సంజయ్ ను తీసుకున్నారు. శేఖర్ కమ్ముల-ధనుష్ సినిమా కోసం సంజయ్ దత్ పేరు పరిశీలనలో వుంది. సంజయ్ దత్ రెమ్యూనిరేషన్ సౌత్ సినిమాకు 10 కోట్లు. అంటే దాదాపు మన దగ్గర ఓ రేంజ్ హీరోల రెమ్యూనిరేషన్లతో సమానం అన్నమాట. అయినా హిందీ రైట్స్, పాన్ ఇండియా కలర్ కోసం ఆ మేరకు ఇవ్వడానికి సిద్ద పడుతున్నారు.

అర్జున్ రాంఫాల్ కు 5 కోట్లు

బాలయ్య – అనిల్ రావిపూడి సినిమా కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంఫాల్ ను తీసుకుంటున్నారు. అందుకు అతను కోట్ చేసిన రెమ్యూనిరేషన్ అయిదు కోట్లు అని తెలుస్తోంది. సినిమాకు కొత్త కలర్ కావాలి. భారీ తనం కావాలి అన్నపుడు ఇలా ట్రయ్ చేయక తప్పదు. అలా ట్రయ్ చేస్తే ఇలా రెమ్యూనిరేషన్ భరించక తప్పదు.

హీరోయిన్లు కూడా

రాను రాను టాప్ హీరోయిన్ల రెమ్యూనిరేషన్లు కూడా పెరుగుతున్నాయి. మన దగ్గర సమంత మూడు కోట్లు కోట్ చేస్తుంటే నయనతార, త్రిష అయిదారు కోట్లు కోట్ చేస్తున్నారు. రష్మిక, పూజా హెగ్డే లాంటి వాళ్ల సంగతి సరేసరి.

మొత్తం మీద రెమ్యూనిరేషన్లను వెనక్కు లాగాలని చూస్తుంటే తెలుగు సినిమా రేంజ్ పెరుగుతుంటే రెమ్యూనిరేషన్లు పెరుతున్నాయి.