Advertisement

Advertisement


Home > Movies - Movie News

శేఖర్ మీద పిడుగు

శేఖర్ మీద పిడుగు

రాజశేఖర్ హీరోగా జీవిత రాజశేఖర్ డైరక్షన్ లో తయారైన శేఖర్ సినిమా మీద కోర్టు ఆదేశాల పిడుగు పడింది. సినిమా ప్రదర్శన ఆగిపోయింది. అష్ట కష్టాలు పడి సినిమాను పూర్తి చేసారు. దాదాపు ఏడు కోట్లకు పైగా ఖర్చు చేసారు. 

ఏ విధమైన అమ్మకాల ఆదాయం రాకపోయినా టోటల్ రిస్క్ చేసి విడుదల చేసారు. రాజశేఖర్ ఫ్యామిలీ, సుధాకర్ రెడ్డి, బొగ్గారం శ్రీనివాస్ ముగ్గురూ కలిసి రిస్క్ బేర్ చేసి విడుదల చేసారు. తొలి రోజు మొత్తం మీద ఓ యాభై లక్షల వరకు షేర్ కనిపించింది.

మలి రోజు వేరే అప్పు తాలూకా ఆదేశాల పిడుగు పడింది. కోర్టు ఆదేశాల మేరకు అరవై లక్షల మేరకు సెక్యూరిటీగా డిపాజిట్ చేయాల్సి వుంది. కానీ ఆ మేరకు జీవిత అండ్ కో చేయలేకపోయారు.దీంతో ఆంధ్ర, తెలంగాణ అంతటా షో లు నిలిపివేసారు. 

కీలకమైన సండే నాడు షో లు లేకుండా పోయాయి. ఇప్పుడు కిందా మీదా పడి మండే నాడు ఏదో ఒకటి చేసి షో లు పునరుద్దరించుకునే పనిలో వున్నారు.

జీవిత-రాజశేఖర్ లకు ఈ సినిమా చాలా కీలకం. ఎందుకంటే ఈ సినిమా మీద వారికి కొంత భారం వుంది. ఆ భారం దించుకోవాలంటే సినిమా కాస్త ఆడాలి. అలాగే శాటిలైట్, డిజిటల్ అమ్మకాలు జరగాలి. కానీ ఎప్పుడైతే కోర్టు వివాదం వచ్చిందో ఇవన్నీ ఆగిపోతాయి. 

సోమవారం నాటికి ఎలాగైనా సినిమా ప్రదర్శనలను పునరుద్దరించాలని జీవిత, ఇతర నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?