డ్రగ్స్ కేసులో నటుడు అరెస్ట్

కొంతమంది డ్రగ్స్ వాడుతున్నారనే పక్కా సమాచారంతో కొచ్చిలోని ఓ హోటల్ పై యాంటీ నార్కోటిక్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.

ఊహించినట్టే జరిగింది. మాదక ద్రవ్యాల కేసులో నటుడు షైన్ టామ్ చాకో అరెస్టయ్యాడు. కేరళ పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ కేసులో ఈ నటుడు అరెస్ట్ అవ్వడం ఇది రెండోసారి.

కొంతమంది డ్రగ్స్ వాడుతున్నారనే పక్కా సమాచారంతో కొచ్చిలోని ఓ హోటల్ పై యాంటీ నార్కోటిక్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ సోదాలు జరగడానికి కొద్దిసేపటి ముందు షైన్ టామ్ చాకో హోటల్ నుంచి పారిపోయినట్టు వార్తలొచ్చాయి.

మూడో అంతస్తు గది నుంచి రెండో అంతస్తులోకి దూకి, అట్నుంచి అటు మెట్ల మార్గం నుంచి పారిపోయినట్టు సీసీటీవీలో దృశ్యాలు కనిపించాయి. దీనిపై పోలీసులు షైన్ టామ్ కు నోటీసులిచ్చారు.

ఈరోజు విచారణకు హాజరైన నటుడ్ని సుదీర్ఘంగా 4 గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు, ఆ తర్వాత అరెస్ట్ చేస్తున్నట్టు నోటీసిచ్చి అదుపులోకి తీసుకున్నారు. సోమవారం నటుడి నుంచి శాంపిల్స్ సేకరించి డ్రగ్స్ టెస్టులకు పంపిస్తారు.

మరో 3 రోజుల్లో అతడు బెయిల్ పై బయటకొస్తే ఓకే. లేదంటే అతడితో షూటింగ్స్ పెట్టుకున్న సినిమా యూనిట్స్ అన్నీ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.

3 Replies to “డ్రగ్స్ కేసులో నటుడు అరెస్ట్”

  1. ఈ మధ్యేగా టాలెంట్ ఉన్న నటుడు, తెలుగు లో చిన్న పాత్రలు చేస్తున్నాడు అన్నావ్… నీ కళ్ళు పడ్డాయి…ఇదిగో పాపం ఇలా తగలడింది అతని ఫేట్

     

Comments are closed.