కొన్ని నెలలుగా సాగుతున్న రాజ్ తరుణ్, లావణ్య వివాదం చర్చల దిశగా సాగుతున్నట్టు కనిపిస్తోంది. లావణ్యతో చర్చలు జరిపి వ్యవహారాన్ని సెటిల్ చేసుకునేందుకు రాజ్ తరుణ్ సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి ముందు జరగాల్సినవి కొన్ని ఉన్నాయి.
రాజ్ తరుణ్ ముందుకొచ్చి చర్చలు జరపాలంటూ లావణ్య రీసెంట్ గా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ అలా ముందుకు రావాలంటే ఓ విషయంపై లావణ్య స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది.
నిజంగా లావణ్య ఏం కోరుకుంటోంది..? ఆమె రాజ్ తరుణ్ తో కలిసి ఉండాలనుకుంటోందా? లేక అన్ని విషయాలు సెటిల్ చేసుకొని తన ‘చిన్నోడి’ జీవితం నుంచి తప్పుకోవాలనుకుంటోందా? మొదటి పాయింటే కే ఆమె కట్టుబడి ఉంటే చర్చల ప్రసక్తి లేదు. రెండో పాయింట్ వైపు మొగ్గుచూపితే చర్చలు మొదలవుతాయి.
రీసెంట్ గా వీళ్లిద్దరి వివాదం విల్లా మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. అది ఎవరికి చెందుతుందనే పాయింట్ పై లావణ్య బలంగా పోరాడుతోంది. ఈరోజు కూడా ఆమె మరోసారి పోలీస్ స్టేషన్ కు వచ్చి తనపై కొంతమంది దాడి చేశారంటూ ఫిర్యాదు చేసింది. తనపై హత్యయత్నం జరుగుతోందని ఆమె అనుమానం వ్యక్తం చేసింది.
సో.. ఆమె చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకోవాలనుకుంటే రాజ్ తరుణ్ రెడీగానే ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే ఎక్కువ కండిషన్లు రాజ్ తరుణ్ నుంచే ఉన్నట్టు తెలుస్తోంది. చూస్తుంటే, ఈ వివాదం మరికొన్ని రోజుల్లో కొలిక్కి వచ్చేలా ఉంది.
అయితే వీళ్ల మధ్య అవగాహన కుదిరినా, అన్ని కేసుల్ని లావణ్య వెనక్కు తీసుకోవడం సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే, డ్రగ్స్ లింక్స్ తో కొన్ని కేసులు ఫైల్ అయి ఉన్నాయి. అవి మాత్రం యథాతథంగా కొనసాగుతాయి.
Waste news