అది తెలిస్తే సంగీతం ఆపేస్తాను – ఇళయరాజా

నేను కంపోజ్ చేసిన పాటల్లో నాకు ఇష్టమైన పాట ఒకటి అంటూ లేదు. నా నుంచి వచ్చినవి కదా, అవన్నీ నాకిష్టమే

ఒకటా.. రెండా.. వేల పాటలు.. ఎన్నో సుమధుర గీతాలు.. అందులో మరెన్నో ఆణిముత్యాలు.. వినేకొద్దీ వినాలనిపించే క్లాసిక్స్.. ఇన్ని హిట్ సాంగ్స్ ఎలా ఇవ్వగలిగారు.. అందరికీ నచ్చేలా ఇన్ని పాటలు ఎలా కంపోజ్ చేయగలిగారు.. ఇదే ప్రశ్న ఇళయరాజాకు ఎదురైంది.

దీనికి ఆయన గమ్మత్తైన సమాధానం ఇచ్చారు. తన నుంచి ఇన్ని సాంగ్స్ ఎలా వస్తున్నాయో తనకే తెలియదని, అది తెలిసిన రోజు సంగీతం చేయడం ఆపేస్తానని ప్రకటించారు.

“నేను కంపోజ్ చేసిన పాటల్లో నాకు ఇష్టమైన పాట ఒకటి అంటూ లేదు. నా నుంచి వచ్చినవి కదా, అవన్నీ నాకిష్టమే. నాకు ఎంత సంగీతం తెలుసనేది ముఖ్యం కాదు, నా నుంచి సంగీతం ఎలా వస్తుందో తెలుసుకోవడం ముఖ్యం. అది నాకు నిజంగా తెలియదు. అది తెలిసిన క్షణం నేను మ్యూజిక్ కంపోజ్ చేయడం ఆపేస్తాను. నా నుంచి మ్యూజిక్ ఎలా వస్తుందో తెలుసుకోవడం కోసమే ఇన్ని సినిమాలు చేస్తున్నాను. నా నుంచి సంగీతం ఎలా వస్తుందో తెలిస్తే నేను రిలాక్స్ అయిపోతాను.”

మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా స్పందన ఇది. సినిమా ఆడియో ఫంక్షన్లలో పెద్దగా కనిపించని ఈ లెజెండ్.. లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో ఓ సినిమా ఫంక్షన్ కు వచ్చారు. దానికి కూడా ఆయన కారణం చెప్పారు.

కొత్తవాళ్లు ఎక్కడున్నా వాళ్లను ప్రోత్సహించాలని అనిపిస్తుందట ఇళయరాజాకు. మణిరత్నం, వంశీ, భారతీరాజా లాంటి దర్శకుల్ని అలానే ప్రోత్సహించానని, అందుకే కొత్త వాళ్లు పిలిస్తే, ఆ ఫంక్షన్ కు హాజరయ్యేందుకు ప్రాధాన్యం ఇస్తానని అన్నారు.

10 Replies to “అది తెలిస్తే సంగీతం ఆపేస్తాను – ఇళయరాజా”

  1. ఈయన గారు ఈయన మీద గౌరవం ఈయన గారే పోగొట్టుకుంటారు  ఒక గౌరవ హోదాలో వుండి అడ్డా దారిలో సంపాదిద్దాం అనే ఆలోచన వుంది చూడు అదే నిన్ను అస్యహించుకునేలా వుంది…

    1. విషయ పరిజ్ఞానం లేని మీలాంటి వారి అభిప్రాయానికి విలువలేదు సార్ 

  2. దేవుడు బ్రహ్భాండమైన సంగీత జ్ఞానం ఇచ్చాడు. కానీ అత్యాశతో దానిని పాడు చేసుకుంటున్నాడు ఆయన. ఎనిమిది పదుల వయస్సుకి దగ్గర పడ్డ ఆయనకు దేవుడు ఈ వయస్సులో ఎందుకీ కక్కుర్తి బుద్ధి పుట్టించాడో?

    1. సార్ మీకు అర్ధం కాలేదు ఆయన కక్కుర్తి కాదు వాడుకునేది అడిగి చెయ్యొచ్చు కదా అని, మీకు తెలీదు ఏమో అడిగిన కొందరు దర్శకుల వద్ద పది రూపాయలు తీసుకున్నారు సరదాగా వాడుకోమన్నారు, ఇక్కడ డబ్బులు కాదు కళాకారుని కి గౌరవం ఇవ్వడం కనీసం ఆయన వున్నప్పుడు అయిన ఏం అడిగితే ఆయన కాదనలేదే 

      1. ఒక్క సారి Ilayaraja Copyright Issues అని Google చేసి చూడండి. ఒక్కొక్క కేసిలో 3.5 కోట్లు, 5 కోట్లు చొప్పున కేసులు వేసాడు ఆయన. ఇవన్నీ పక్కన పెడితే SPB గారు ఏం చేసారండీ? ఒకప్పుడు ఇద్దరూ సహధ్యాయులు కాదా? ప్రతీ వేదిక మీద ఇలాంటి మిత్రుడు తనకు ఉన్నందుకు ఆయన ఎంతగా ఇళయరాజా గారిని పొగుడుతూ మాట్లాడుతారు. అలాంటి తన మిత్రుడికే నోటీసులు పంపడం ఏంటండీ?

        1. అవును కాపీ రైట్ ఇష్యుస్ కింద కేసులు వేశారు ఇన్నేసి కోట్లు అంటారు కానీ అవి నిజానికి చాలా తక్కువకి సెటిల్ అవుతాయి, ఇక్కడ ఆయన భాధ తను బ్రతికి ఉండగా తను స్వరపరిచిన పాటలను కనీసం చెప్పి వాడుకోవచ్చు కదా అని అడిగితే నేను కాదు అనను కదా అని ఇదే విషయం తమిళ ఇంటర్వ్యూ లో కూడా చెప్పారు, వీలైతే యూట్యూబ్ లో ఉంటుంది చూడండి.అలాగే సింగర్స్ విషయం కూడా ఆయన ప్రత్యేకంగా బాలు గారి ఒక్కరిమీద వెయ్యలేదు అందరు తనని అడగకుండా పాడుతున్నారు అని సింగర్స్ అందరికీ నోటీసులు పంపారు అందులో బాలు గారు కూడా వున్నారు అంతెందుకు సార్ సొంత తమ్ముడు గంగై ఆమరన్ మీదే అన్నారు

Comments are closed.