Advertisement

Advertisement


Home > Movies - Movie News

శృతిహాసన్ సిద్ధం

శృతిహాసన్ సిద్ధం

సలార్ పార్ట్-2 షూటింగ్ కు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. అటు కీలకమైన నటీనటులు కూడా అందుబాటులోకి వస్తున్నారు. ఇప్పటికే పృధ్వీరాజ్ సుకుమారన్ తన కాల్షీట్లు కేటాయించాడు. సలార్ -2 కోసం రెడీగా ఉన్నాడు. అటు ప్రభాస్ కూడా సలార్-2 షూట్ కోసం డేట్స్ కేటాయించాడు. కల్కి కొలిక్కి వచ్చిన తర్వాత పూర్తిస్థాయిలో ప్రశాంత్ నీల్ తో కలిసి వర్క్ చేయబోతున్నాడు. ఇప్పుడీ సినిమాకు శృతిహాసన్ కూడా అందుబాటులోకి వచ్చింది.

మొన్నటివరకు ఇతర సినిమాలు, తన మ్యూజిక్ ఆల్బమ్స్ తో బిజీగా ఉన్న శృతిహాసన్.. సలార్-2 షూటింగ్ కు కాల్షీట్లు కేటాయించింది. మే రెండో వారం నుంచి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది శృతిహాసన్.

ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషిస్తున్న బాబి సిమ్హా ఇదివరకే సలార్-2పై ప్రకటన చేశాడు. ఏప్రిల్ నుంచి ఆ సినిమా సెట్స్ పైకి వస్తుందని, తను జాయిన్ అవుతానని అన్నాడు. కానీ తాజా సమాచారం ప్రకారం, ఈ నెలలో సలార్-2 సెట్స్ పైకి వచ్చే అవకాశాలు తక్కువ.

మొత్తమ్మీద ఏప్రిల్ మిస్సయినా మే నెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి కచ్చితంగా వస్తుందనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే, అందరూ అప్పటికి ఫ్రీ అవుతారు. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కు విడుదలయ్యే అవకాశం ఉందని తాజాగా పృధ్వీరాజ్ సుకుమారన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?