Advertisement

Advertisement


Home > Movies - Movie News

అప్పుడు బాహుబలి.. ఇప్పుడు దేవర

అప్పుడు బాహుబలి.. ఇప్పుడు దేవర

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాకు నార్త్ నుంచి పెద్ద సపోర్ట్ దొరికింది. ఉత్తరాదిన ఈ సినిమాను కరణ్ జోహార్ విడుదల చేయబోతున్నాడు. గతంలో బాహుబలి-1, బాహుబలి-2 సినిమాల్ని నార్త్ బెల్ట్ లో రిలీజ్ చేసింది ఇతడే. ఆ సినిమా టైపులోనే దేవర కూడా 2 భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ 2 భాగాల్ని ధర్మ ప్రొడక్షన్స్, ఏఏ ఫిలిమ్స్ బ్యానర్ల పై కరణ్ జోహార్, అనీల్ తడానీ, అపూర్వ మెహతా ఉత్తరాదిన డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు.

దేవర సినిమాను నార్త్ లో డిస్ట్రిబ్యూట్ చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు ప్రకటించాడు కరణ్ జోహార్. ఎన్టీఆర్ దేవర రూపంలో మాస్ తుపాను ప్రేక్షకులను చుట్టుముట్టడానికి సిద్ధమౌతోందంటూ తెలిపాడు.

లార్జర్ దేన్ లైఫ్ స్టోరీతో దేవర సినిమా తెరకెక్కుతున్నట్టు దర్శకుడు కొరటాల ఇప్పటికే ప్రకటించాడు. భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరూ కనెక్ట్ అయ్యేలా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కథ చాలా పెద్దదని, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో రెండు భాగాలు చేశామని కూడా క్లారిటీ ఇచ్చాడు.

సో.. కొరటాల యాంగిల్ లో చెప్పుకుంటే దేవర సినిమా కచ్చితంగా పాన్ ఇండియా సినిమానే. పైగా జాన్వి కపూర్, సైఫ్ అలీఖాన్ లాంటి నటులు ఉండడం కూడా నార్త్ లో దేవరకు ప్లస్ పాయింట్ కానుంది.

యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై సుధాకర్ మిక్కిలినేని ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ ప్రజెంట్ చేస్తున్నాడు. అక్టోబర్ 10న దేవర పార్ట్-1 థియేటర్లలోకి రానుంది. ప్రేక్షకులు, తన అభిమానులు గర్వంగా కాలర్ ఎగరేసేలా సినిమా ఉంటుందని ఎన్టీఆర్ ప్రకటించడంతో, దేవరపై అంచనాలు మరింత పెరిగాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?