అత్యంత విషమంగా సిరివెన్నెల ఆరోగ్యం

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. న్యూమోనియాతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని…

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. న్యూమోనియాతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

తీవ్ర అస్వస్థతకు గురైన సిరివెన్నెలను ఈ నెల 24న సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో జాయిన్‌ చేశారు. 

ఐసీయూలో వైద్య బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ త్వరగా కోలుకునేందుకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని సోమవారం విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో కిమ్స్‌ వర్గాలు పేర్కొన్నాయి.

తాజా సమాచారం ప్రకారం సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ప్రార్థిస్తున్నారు.