హీరోయిన్ పర్సనల్ వీడియో లీక్

వ్యక్తిగత సమాచారం, వీడియోలు సోషల్ మీడియాకెక్కినప్పుడు ఎవరికైనా బాధగా ఉంటుంది. హీరోయిన్ల వీడియోలు లీక్ అయితే అది మరీ దారుణం. తమిళ హీరోయిన్ పర్సనల్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Advertisement తమిళ,…

వ్యక్తిగత సమాచారం, వీడియోలు సోషల్ మీడియాకెక్కినప్పుడు ఎవరికైనా బాధగా ఉంటుంది. హీరోయిన్ల వీడియోలు లీక్ అయితే అది మరీ దారుణం. తమిళ హీరోయిన్ పర్సనల్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తమిళ, మలయాళ భాషల్లో పలు సినిమాలు చేసి, తమిళ బిగ్ బాస్ తో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ ఒవియా వ్యక్తిగత వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఓ వ్యక్తితో అత్యంత సన్నిహితంగా ఉన్న ఆ వీడియో నిమిషాల్లో వైరల్ అయింది.

అయితే ఇలాంటి వీడియోలు బయటకొచ్చినప్పుడు ఫేక్ అయిందని లేదా మార్ఫింగ్ చేశారని చెబుతుంటారు. ఒవియా మాత్రం ఆ వీడియో తనదేనని పరోక్షంగా నిర్థారించింది.

సోషల్ మీడియాలో ఒవియాను ట్యాగ్ చేసిన ఓ వ్యక్తి, చిన్న క్లిప్ మాత్రమే లీక్ అయిందని, టోటల్ వీడియో పెట్టాలని ఒవియాను టీజ్ చేశాడు. దీనిపై స్పందించిన ఒవియా.. నెక్ట్స్ టైమ్ పెద్ద క్లిప్ వస్తుందిలే అంటూ సమాధానం ఇచ్చింది.

మలయాళీ సినిమాలతో పాపులరైన ఒవియా, ఆ తర్వాత కోలీవుడ్ లో అడుగుపెట్టింది. తమిళ్ లో ఆమె పలు హిట్ సినిమాల్లో నటించింది. ఆమె నటించిన కాంచన-3 లాంటి సినిమాలు తెలుగులోకి కూడా డబ్ అయ్యాయి. అంతకంటే ముందే ‘ఇది నా లవ్ స్టోరీ’ సినిమాతో ఆమె తెలుగులో కూడా అడుగుపెట్టింది.

3 Replies to “హీరోయిన్ పర్సనల్ వీడియో లీక్”

Comments are closed.